యువతని పిచ్చెక్కిస్తున్న భైరవ గీత స్టిల్స్

  • October 16, 2018 / 09:24 AM IST

ప్రేమకథని రొమాంటిక్ గా చెబుతారు… సెంటిమెంట్ గా చూపిస్తారు.. కానీ ఈ మధ్య రక్తపాతంతో చెబితే ప్రేక్షకులు హిట్ చేస్తున్నారు. అందుకే కొత్త దర్శకులు ప్రేమకి.. యాక్షన్ తో పాటు ఫ్యాక్షన్ ని మిక్స్ చేస్తున్నారు. అలంటి కథతో సిద్ధార్థ్ తాతోలు తెరకెక్కించిన మూవీ భైరవ గీత. ఈ సినిమాకి సిద్ధార్థ్ డైరక్టర్ అయినప్పటికీ కర్త, క్రియ అంతా వర్మ అని ఆ మూవీ ట్రైలర్ స్పష్టం చేసింది. ధ‌నంజ‌య‌, ఇర్రా మార్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్ 12న విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. దీంతో ఈ సినిమా గురించి మరిచిపోతారని భావించిన వర్మ అందాల సెగని పుట్టియించారు.

ధ‌నంజ‌య‌, ఇర్రా మార్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలకు సంబంధించిన స్టిల్స్ రిలీజ్ చేశారు. ఈ స్టిల్స్ కుర్రకారుని పిచ్చెక్కిస్తోంది. సినిమా ఎప్పుడు చూద్దామనే ఆశని రేకెత్తిస్తోంది. అందుకే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ లైక్లు, షేర్లు అందుకొని వైరల్ అయ్యాయి. మొత్తానికి వర్మ ప్లాన్ ని సినీ విశ్లేషకులు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. వర్మ దర్వకత్వంలో వచ్చిన సినిమాలు థియేటర్లోకి వచ్చినట్టే వచ్చి వెళ్లిపోతున్నాయి. మరి అతను సమర్పిస్తున్న భైరవ గీత ఎంతమేర విజయం సాధిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus