నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ చిత్రాల్లో భలే భలే మగాడివోయ్ ఒకటి. అంతేకాదు అత్యంత ఎక్కువ కలక్షన్స్ సాధించిన సినిమా అది. అందుకే నానికి ఆ చిత్రం అంటే భలే ఇష్టం. మారుతి దర్శ కత్వంలో వచ్చిన ఈ మూవీలో నాని పోషించిన లక్కీ పాత్ర ఒక విషయంపై నుంచి మరో విషయానికి సులువుగా వెళ్లిపోతుంటుంది.
అతని కాన్సంట్రేషన్ ఈజీగా వేరే దానిపై వెళ్లిపోతుంటుంది. నిజజీవితంలోనూ నాని తరచూ అలా ప్రవర్తించడం వల్ల మల్టీ ఫ్లెక్స్ అంటూ స్నేహితులు తనని పిలుస్తుంటారని ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. తన రియల్ లైఫ్ కి దగ్గరి చిత్రం కావడంతో దానికి సీక్వెల్ చేయాలనీ ఆలోచనలో ఉన్నట్లు నిన్న సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ఇంకా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సరదాగా జవాబులు ఇచ్చారు. ఖాళీ సమయంలో ఏమి చేస్తారంటే.. “సినిమాలు చేస్తాను.. లేదా చూస్తాను” అన్నారు.
మీకు ఎలాంటి సినిమాలు చేయడం ఇష్టం అని ప్రశ్నిస్తే “మీకు ఎలాంటివి చూడడం ఇష్టమో.. అలాంటివి చేయడం ఇష్టం” అని స్పాంటేయస్ గా చెప్పారు. కథల ఎంపికలో మీ ఫార్ములా ఏమిటంటే “నాకు నచ్చాలి.. నాకు నచ్చితే మీకూ నచ్చుతుందని నా నమ్మకం” అని తన సక్సస్ సీక్రెట్ ని వెల్లడించారు. తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రం చేస్తాను కానీ బాలీవుడ్ కి వెళ్లే ఆలోచన అసలు లేదని క్లారిటీ ఇచ్చారు.