ఏప్రిల్‌ 7న భరత్‌ బహిరంగ సభ!

  • April 1, 2018 / 12:12 PM IST

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం ‘భరత్‌ అనే నేను’. ఈ చిత్రం ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు రెండు పాటలు విడుదలయ్యాయి. భరత్‌ అనే నేను టైటిల్‌ సాంగ్‌, ‘ఐ డోంట్‌ నో’ పాటలకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో సూపర్‌స్టార్‌ మహేష్‌ ముఖ్యమంత్రిగా కనిపిస్తారు.

ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ ‘భరత్‌ బహిరంగ సభ’ పేరుతో ఏప్రిల్‌ 7 సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్‌.బి. స్టేడియంలో ప్రేక్షకులు, అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో వైభంగా జరగనుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus