భారీ స్థాయిలో ‘భరత్ అను నేను’ ప్రీమియర్ షోలు

  • April 6, 2018 / 06:39 AM IST

మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ సినిమాలు తెరకెక్కించి హ్యాట్రిక్ హిట్ అందుకున్న డైరక్టర్ కొరటాల శివ మరో హిట్ కొట్టనున్నారు. మహేష్ బాబుతో భరత్ అను నేను సినిమా చేస్తున్నారు. నిన్నటితో ఈ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. శ్రీమంతుడు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై మొదట నుంచి భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను ఫస్ట్ ఓత్, భరత్ విజన్ లు పెంచాయి. పాటలు మరింత క్రేజ్ తీసుకొచ్చాయి. ఆ క్రేజ్ కారణంగా ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడ భారీ స్థాయిలో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలోను భారీగా రిలీజ్ చేస్తున్నారు.

డిస్ట్రిబ్యూటర్లు మంచి ఓపెనింగ్స్ కోసం విడుదల ముందురోజు 19వ తేదీ రాత్రి అమెరికా వ్యాప్తంగా సుమారు 2000 ప్రీమియర్ షోలను ఏర్పాటు చేశారు. ఈ భారీస్థాయి షోల వలన రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ వస్తాయి. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ చిత్రం యొక్క ఆడియో వేడుక రేపు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి ప్రతిపక్షనేతగా తనదైన శైలిలో నవ్వులు పూయించనున్నారు. ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 20 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus