ఆకట్టుకున్న భరత్ విజన్..!

  • March 6, 2018 / 01:06 PM IST

దూకుడు సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కాసేపు ఎమ్మెల్యేగా కనిపిస్తే అభిమానులు సంతోషపడ్డారు. ఇప్పుడు ముఖ్యమంత్రి భరత్ గా చూసి పండుగ చేసుకోనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న “భరత్ అనే నేను” (Bharat Aney Nenu) సినిమా ఫస్ట్ ఓత్ జనవరి 26 న రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంది. నేటి ముఖ్యమంత్రిగా మహేష్ ప్రమాణంతో అదరగొట్టారు. ఈ రోజు “భరత్ విజన్” పేరిట టీజర్ రిలీజ్ అయింది. ఈ వీడియోలో ముఖ్యమంత్రిగా తాను ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడానికి ఎంతదూరమైనా వెళ్తానని చెప్పారు.

“మనం సమాజంలో బతుకుతున్నాం. ప్రతి ఒక్కరికీ భయం, బాధ్యత ఉండాలి” అంటూ మహేష్ చెబుతుంటే.
ఆ బాధ్యత ఏంటో తెలుసుకోవాలనే ఆత్రుత కలుగుతోంది. ఈ వీడియో సినిమాపై అంచనాలను మరింత పెంచింది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి చివరి షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. 16 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ త్వరలో మొదలుకానుంది. ఇందులో మిలిగిన ఒక పాటతో పాటు, సన్నివేశాలను కంప్లీట్ చేయనున్నారు. దీంతో ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచి. ముందుగా ప్రకటించిన విధంగా ఏప్రిల్ 20న సినిమా రిలీజ్ అయ్యేలా చేయనున్నారు. ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus