Euphoria Movie : స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన భూమిక..! ఎందుకు అంటే..?

తెలుగు సినీ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరోయిన్ భూమిక చావ్లా. ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన భూమిక, మహేశ్‌బాబు సరసన ఒక్కడు, పవన్ కళ్యాణ్‌తో ఖుషి, జూనియర్ ఎన్టీఆర్‌తో సింహాద్రి లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. విక్టరీ వెంకటేశ్, నాగార్జున వంటి హీరోలతోనూ ఆమె చేసిన సినిమాలు అప్పట్లో భారీ విజయాలు సాధించాయి. ఆ తర్వాత వివాహం కారణంగా కొంతకాలం సినిమాలకు దూరమైన భూమిక, నాచురల్ స్టార్ నాని నటించిన ఎంసీఏ చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.

Euphoria Movie

ఇప్పుడు భూమిక కెరీర్‌లో మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది అదే ‘యుఫోరియా’. ఒక్కడు వంటి మరపురాని హిట్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా జరిగిన ‘యుఫోరియా’ ఈవెంట్‌లో భూమిక తీవ్ర భావోద్వేగానికి లోనవడం అందరి దృష్టిని ఆకర్షించింది. స్టేజ్‌పై మాట్లాడుతూనే ఆమె కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. షూటింగ్ సమయంలో ఈ పాత్ర తనను ఎంతగా ప్రభావితం చేసిందో చెప్పే క్రమంలో, “చాలా రాత్రులు నిద్ర లేకుండా గడిచాయి.. పాత్ర ఆలోచనలే వెంటాడేవి” అంటూ భావోద్వేగంగా మాట్లాడింది.

ఒకసారి స్టేజ్ నుంచి వెనక్కి వెళ్లి మళ్లీ మాట్లాడేందుకు ప్రయత్నించినా, భావాలను అదుపులో పెట్టుకోలేకపోయింది. ఈ దృశ్యం చూసిన అభిమానులు, మీడియా ప్రతినిధులు ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సందర్భంగా యాంకర్ మాట్లాడుతూ, “సినిమా చూస్తే భూమిక ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారో, సినిమాకు ఎంత కనెక్ట్ అయ్యారో అర్థమవుతుంది” అని వ్యాఖ్యానించారు.

‘యుఫోరియా’ సినిమాకు గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, గౌతమ్ మీనన్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటించారు. కాలభైరవ స్వరాలు అందించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదల కానుండగా, ఫిబ్రవరి 5న హైదరాబాద్‌లో ప్రత్యేక ప్రీమియర్ షో నిర్వహించనున్నారు. ఎన్నో హిట్లతో ప్రేక్షకులను అలరించిన భూమిక, ఈ సినిమాతో మరోసారి తన నటనా శక్తిని చాటుతుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది.

Chandrahas : ఆటిట్యూడ్ స్టార్ పై కేసు నమోదు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus