యాత్రలో ముఖ్యభూమిక పోషించనున్న భూమిక!

  • May 22, 2018 / 02:11 PM IST

వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా “ఆనందో బ్రహ్మ” ఫేమ్ మహి వి.రాఘవ “యాత్ర” అనే సినిమా మొదలెట్టిన విషయం అందరికీ తెలిసిందే. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో జగన్ గా ఎవరు నటిస్తున్నారు అనే విషయంలో ఇంకా క్లారిటీ లేనప్పటికీ.. జగన్ చెల్లెలు షర్మిల పాత్రకు మాత్రం సీనియర్ నటీమణి భూమికను సెలక్ట్ చేశారు.

వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనున్న ఈ చిత్రం ప్రీప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతోంది. తొమ్మిదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పట్టం కట్టడం కోసం రాజశేఖర్ రెడ్డి చేసిన పాద”యాత్ర” దగ్గర్నుంచి కథ మొదలవుతుంది.

“మిడిల్ క్లాస్ అబ్బాయి”తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన భూమిక ప్రస్తుతం “సవ్యసాచి”లో కీలకపాత్ర పోషిస్తోంది. అలాగే.. మరికొన్ని సినిమాల్లోనూ భూమిక ముఖ్యభూమికలు పోషిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ ను సూపర్ సక్సెస్ ఫుల్ గా సెట్ చేసుకొంటోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus