భూమిక విడాకులు తీసుకోనుందా..?

  • October 22, 2020 / 11:02 AM IST

‘యువకుడు’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన నటి భూమిక ఆ తరువాత ‘ఖుషి’, ‘ఒక్కడు’, ‘సింహాద్రి’ వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత 2007లో తన యోగా టీచర్ భరత్ ఠాకూర్ ని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. వీరికో కుమారుడు కూడా ఉన్నాడు. దాదాపు 13 ఏళ్లుగా ఈ జంట తమ దాంపత్య జీవితాన్ని అనుభవిస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య బంధం తెగిపోయిందని.. విడాకులు తీసుకునే వరకు వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది.

భూమిక ఈ మధ్యకాలంలో భర్తతో కలిసి కాకుండా ఒంటరిగా కనిపించడం వలన ఈ వార్తలు మొదలయ్యాయి. దీంతో ఈ వార్తలకు చెక్ పెట్టాలని భావించింది భూమిక. ఈ మేరకు తాజాగా తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ లో తన భర్తతో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. తమ వివాహ వార్షికోత్సవమని తెలియజేశారు. ”వేల మైళ్ల ప్ర‌యాణ‌మైనా ఒక్క అడుగుతోనే మొద‌లవుతుంది.. ఆ ఒక్క అడుగు ప్రేమే.. ఒక‌రి గురించి ఒక‌రం మ‌రింత లోతుగా అర్థం చేసుకోవ‌డమే.

మన గురించి మ‌నం ఇంకా తెలుసుకోవ‌డ‌మే. మ‌న‌ దాంపత్య జీవితాన్ని ఆ దేవుడు ఆశీర్వ‌దించాలి. నిన్ను, నీ అంకిత‌భావాన్ని, క‌ష్ట‌ప‌డే మ‌న‌స్త‌త్వాన్ని చూస్తుంటే గ‌ర్వంగా ఉంది” అంటూ తన భర్త గురించి ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ గా రాసుకొచ్చింది. కనీసం ఈ పోస్ట్ తోనైనా.. భూమిక విడాకుల వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి!

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus