బాలయ్య రేంజ్ ఏంటీ.. ఆ హోటల్ ఏంటి!

హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా మూడు దశాబ్ధాలపాటు తెలుగులో అగ్ర కథానాయకుడిగా కొనసాగిన స్థాయి బాలయ్యది. నిన్నటితో బాలయ్య హీరోగా ఇండస్ట్రీకి పరిచయమై 45 ఏళ్ళు పూర్తయ్యింది. అలాంటి బాలయ్యను ఆయన నటిస్తున్న 105వ సినిమా నిర్మాతలు దారుణంగా అవమానించారని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే బ్యాంకాక్, థాయ్ ల్యాండ్ లలో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొన్న బాలయ్య తాజా చిత్రం షూటింగ్ సమయంలో.. బాలయ్యకు, సినిమా దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కు చిత్రబృందం ఒక చీప్ హోటల్ లో రూమ్స్ బుక్ చేసిందట.

సాధారణంగా కెమెరా ఆపరేటర్స్ & అసిస్టెంట్ డైరెక్టర్స్ కు అలాంటి హోటల్స్ లో రూమ్స్ బుక్ చేస్తారట. అలాంటిది బాలయ్యకు, రవికుమార్ కు కూడా అదే హోటల్ లో రూమ్ బుక్ చేయడం పట్ల బాలయ్య పెద్దగా పట్టించుకోకపోయినా.. కె.ఎస్.రవికుమార్ మాత్రం కాస్త గట్టిగానే సీరియస్ అయ్యాడట. చాలాసార్లు సినిమా యూనిట్ పై గట్టిగా అరిచేశాడట. షెడ్యూల్ ను కూడా ఏదో పూర్తయ్యింది అనిపించాడట. మరి సినిమా యూనిట్ ఇలాంటి చీప్ ట్రిక్ ఎందుకు ప్లే చేసింది అనేది తెలియాల్సి ఉండగా.. నిన్న విడుదలైన కొత్త పోస్టర్స్ లో మాత్రం బాలయ్య భలే ఉన్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus