చిన్న సినిమాకి అండగా పెద్ద నిర్మాత

  • October 3, 2016 / 07:26 AM IST

సినిమాల్లో నటించాలనే ఉత్సుకతతో ఉన్నవారున్నారు. సినిమా తీయడమే లక్ష్యంగా పెట్టుకున్న వారూ ఉన్నారు. వీరికి జతగా డిజిటల్ విధానం వల్ల ఉండనే ఉంది. ఫలితంగా సినిమా తయారవడం నేటి రోజుల్లో పెద్ద కష్టమేమీ కాదు. మరి దాన్ని ప్రేక్షకులకు చేరవేయాలంటే.. థియేటర్ లోకి తేవాలంటే.. ఓవారం పాటైనా నిలదొక్కుకోవాలంటే.. సినిమా వ్యాపారాన్ని ఔపోసన పట్టిన వారి అండదండలు ఉండి తీరాల్సియిందే.

కొత్త నటీనటులతో, సాంకేతిక నిపుణలతో ‘ఇలా నీ జతగా’ అనే చిత్రం రూపుదిద్దుకుంది. ఈ బృందంలో అందరూ ప్రతిభావంతులే. హీరో విశ్వక్ సేన్ అనుపమ్ ఖేర్ ఫిల్మ్ స్కూల్ విద్యార్థి కాగా, దర్శకుడు యూకూబ్ అలీ రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో శిక్షణ తీసుకున్నాడు. ఇక సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి రెహమాన్ స్కూల్ లో శిష్యరికం చేశాడు. ఈ ప్రతిభావంతులు రూపొందించిన సినిమా ట్రైలర్ ను నాని విడుదల చేశారు. ట్రైలర్ బావుందన్నమాట ఆ నోటా ఈ నోటా చేరి చివరికి దిల్ రాజు వద్దకు చేరుకుంది. ఆయన సినిమా చూసి ‘వెళ్ళిపోమాకే’ అని పేరు మార్చి ఈ సినిమా తానే విడుదల చేస్తానని ముందుకొచ్చారు. చిన్న సినిమాలకు ఇటీవలి కాలంలో అగ్ర నిర్మాతల నుండి చేయూత లభిస్తున్న సంగతి తెలిసిందే. సురేష్ బాబు గారి వల్ల ‘పెళ్లి చూపులు’ ఏ స్థాయికెళ్ళిందో తెలిసిందే. ఈ సినిమాకి దిల్ రాజు కూడా అంతే బలం అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus