టాలీవుడ్ లో ఎక్కడ చూసినా…మెగా ఫ్యామిలీ….నందమూరి ఫ్యామిలీ…లేదా అక్కినేని ఫ్యామిలీ అంటూ ఇలా హీరోల ఫ్యామిలీలా గురించే విషయం అంతా వినిపిస్తూ ఉంటుంది. అయితే అదే క్రమంలో చిరంజీవిని మెగాస్టార్ గా మార్చిన ”అల్లు”ఫ్యామిలీ సైతం అదే ఇండస్ట్రీలో ఉన్నది అన్న సంగతి మరచిపోతే ఎలా…ఇంతకీ విషయం ఏమిటంటే…కధను ఎంచుకుని…బడ్జెట్ ను కంట్రోల్ చేసి….చిన్న సినిమాలను కూడా భారీ సక్సెస్ ను కొట్టే దిశగా నిర్మించగల నిర్మాతల్లో ఒకరు మన అల్లు ఆరవింద్.
అయితే తాజాగా జరుగుతున్న కొన్ని పరిణామాల విషయంలో అల్లు ఆరవింద్ ఒక భారీ ప్లాన్ కు సిద్దం అవుతున్నాడు….అదేమిటి అంటే….మన టాలీవుడ్ లో ఇతర భాష హీరోలు వారి సినిమాలకు సంబంధించి భారీ ఫంక్షన్లు చేసి, మరింత భారీగా లాంచ్ అవుతున్న మ్యాటర్ మనం చూస్తూనే ఉన్నాం…..తాజాగా….భాగ్యనగరంలో ‘జాగ్వార్’ హీరో నిఖిల్ గౌడ సినిమాకు సంబంధించిన భారీ ఫంక్షన్ గురించి తెలిసిందే. ఇలా కన్నడ స్టార్ లు తమిళ స్టార్ లు టాలీవుడ్ లో లాంచ్ అవుతున్నారు కాని మన స్టార్ లు మాత్రం పక్క భాషల సినిమా రంగాలలో లాంచ్ కావడం లేదు అన్న ఆలోచనతో ఉన్న మన అల్లు ఆరవింద్ ఎలా అయినా తన కుమారుడు బన్నీని తమిళంలో భారీగా లాంచ్ చెయ్యాలి అని పక్కా స్కెచ్ వేసుకున్నాడు….అందులో భాగంగానే….బన్నీ కోసం కోలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ జ్ఞాన్ వేల్ రాజాను రంగంలోకి దింపి మరీ బన్నీకి తమిళంలో మార్కెట్ పెంచాలి అని ఆలోచన చేస్తున్నాడు.
జ్ఞాన్ వేల్ లాంటి బడా నిర్మాత అండదండలు ఉంటే బన్నీని భారీ స్థాయిలో ప్రమోట్ చెయ్యడం ఈజీ అని భావిస్తున్నాడు మన అల్లు ఆరవింద్. హీరో సూర్య ఫ్యామిలీకి చెందిన జ్ఞాన్ వేల్ రాజాకు అల్లు అరవింద్ తో ఎప్పటి నుంచో బిజినెస్ అనుబంధాలు ఉండడం బాగా కలసి వచ్చింది అని తెలుస్తుంది…మరి ఈ భారీ స్కెచ్ ఎంతవరకూ కలసి వస్తుందో చూడాలి.