బిగ్ బాస్4 : 8వ వారం నామినేషన్ లిస్ట్ ఇదే..!

  • October 26, 2020 / 11:28 AM IST

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ అనేది ప్రతివారం జరిగే ప్రక్రియే. దీనినిబట్టే ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. ఈ నామినేషన్స్ తప్పించుకోవడం కోసం హౌస్ మేట్స్ మనసులు గెలవాలి. అలాగే ఎలిమినేషన్ తప్పించుకోవాలంటే బయట ఉన్న ప్రేక్షకులని గెలవాలి. ఇలా గెలిచినవాళ్లే విన్నర్ అవుతారు. అయితే, ఈవారం అంటే 8వ వారం నామినేషన్స్ లోకి ఏడుగురు వస్తారని తెలుస్తోంది. అయితే, ఆ ఏడో వ్యక్తి ఎవరు అనేది మాత్రం సస్పెన్స్ గా ఉంది.

ప్రస్తుతం ఫిల్మీ ఫోకస్ కి ఎక్స్ క్లూజివ్ గా అందుతున్న సమాచారం లిస్ట్ ప్రకారం చూస్తే.. ఈవారం నామినేషన్స్ అనేవి ఓపెన్ నామినేషన్స్ జరగబోతున్నాయి. సిరామిక్ పలకపైన హౌస్ మేట్ ఫోటని గొడ్డలితో కొట్టి మరీ నామినేట్ చేయాలి. ఒకరినొకరు రీజన్స్ చెప్పుకుంటూ నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఇది నామినేషన్స్ ప్రక్రియ. ఇక ఇందులో మనకి ప్రస్తుతం ఆరుగురి పేర్లు లిస్ట్ లోకి వచ్చినట్లుగా తెలుస్తున్నాయి.

వారిలో అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్, అమ్మరాజశేఖర్, మెహబూబ్ దిల్ సే, లాస్య, అరియానా వీళ్లు నామినేషన్స్ లోకి వచ్చినట్లుగా సమాచారం తెలుస్తోంది. అయితే, ఏడో వ్యక్తి కూడా ఉన్నాడని అందులో సోహైల్ లేదా అభిజిత్ ఉంటారని కూడా చెప్తున్నారు. ఇప్పటివరకూ అయితే లిస్ట్ లో వీళ్ల పేర్లు ఉన్నాయి. మరి ఈ వీక్ వీళ్లలోనే ఎలిమినేషన్ అనేది జరగబోతోంది. మొత్తానికి అదీ మేటర్.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus