బిగ్ బాస్ మొదటి ప్రోమో వచ్చేసింది…చూసేయండి..!

  • August 12, 2020 / 09:55 PM IST

ప్రేక్షకులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ మొదటి ప్రోమో వచ్చేసింది. మరి కొద్దిరోజులలో బిగ్ రియాలిటీ షో మొదలుకానుందన్న నమ్మకాన్ని ప్రేక్షుకులలో తెచ్చేసింది. చాలా రోజులుగా బిగ్ బాస్ పై వరుస కథనాలు వెలువడుతున్నాయి. ఖచ్చితంగా బిగ్ బాస్ ఉంటుందన్న నమ్మకం ఉన్నప్పటికీ అది ఎప్పటికి సాధ్యం అనే మీమాంస మాత్రం ప్రేక్షకులలో ఉంది. తాజా ప్రోమోతో స్టార్ మా యాజమాన్యం అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ త్వరలోనే దిగుతున్నాం అనే నమ్మకం బలపరిచింది.

మూడవ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించిన కింగ్ నాగార్జున, వరుసగా నాలుగవ సీజన్ కి కూడా హోస్ట్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 4 ప్రోమోలో నాగార్జున డిఫరెంట్ లుక్ లో దర్శనం ఇచ్చారు. మన్మధుడు నాగార్జున ఈ ప్రోమోలో వృద్దుడిగా కనిపించాడు. ఆయన బైనాక్యులర్ లో ఇంటి సభ్యుల చేష్టలు చూస్తు నవ్వుకుంటున్నారు. ఇక ఎవరినో ఉద్దేశించి ఆయన గోపి అనడం ఆసక్తి రేపుతోంది. ఇంటి సభ్యుల అవకాశవాద తత్త్వాన్ని నాగార్జున అలా వర్ణించినట్లు తెలుస్తుంది.

గత మూడు సీజన్స్ సూపర్ సక్సెస్ కాగా. సీజన్ 4 పై ప్రేక్షకులలో అంచనాలు భారీగా ఉన్నాయి. వీరి అంచనాలు అందుకొనేలా, ప్రేక్షకులకు కావలసిన మరింత ఫన్ అండ్ కాంట్రవర్సి జోడించి ఉత్కంఠ భరితంగా షో మార్చనున్నారట. ఈ సీజన్ కోసం నాగ్ సైతం భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంటున్నట్లు సమాచారం. ఇక ఈ సీజన్లో పాల్గొనే సెలెబ్రిటీల లిస్ట్ పై క్లారిటీ రావాల్సివుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus