వైరల్ అవుతున్న అషూ రెడ్డి బర్త్ డే పిక్స్..!

‘కింగ్ నాగార్జున’ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 3’ లో ‘టిక్ టాక్’ స్టార్ అషూ రెడ్డి కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. జూనియర్ సమంతగా పాపులర్ అయిన ఈ భామ 5 వారాల పాటు ‘బిగ్ బాస్’ హౌస్ లో ఉంది. ఈమె ఎంట్రీని చూసిన అభిమానులు షాక్ అయ్యారు. ఎందుకంటే ఈమె లుక్ అలా ఉంది. ‘టిక్ టాక్’ వీడియోల్లో సన్నగా కనిపించే ఈ అమ్మడు.. సడెన్ గా లావుగా కనిపించేసరికి అందరూ షాక్ అయ్యారు. ‘అయితే కొన్ని పరిస్థితుల వల్ల డిప్రెషన్ కి వెళ్ళిపోవడంతో ఇలా అయిపోయానని’ ఓ సందర్భంలో అషూరెడ్డి కూడా చెప్పుకొచ్చింది. ఇక హౌస్ లో అయితే ఈమె టాస్కులు సరిగ్గా ఆడేది కాదు. కానీ ఓ టాస్క్ లో ‘జిగేల్ రాణి’ పాటకి డ్యాన్స్ చేసి అదరకొట్టింది.

ఇక హౌస్ నుండీ బయటకి వచ్చిన తరువాత కొన్ని ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 15న ఆమె పుట్టిన రోజు కావడంతో తన ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చింది. ఇక ఈ పార్టీకి తన ‘బిగ్ బాస్’ స్నేహితురాలైన రోహిణి ని కూడా ఆహ్వానించింది. ఇక ఈ వేడుకలో బ్లాక్ ‘అవుట్ ఫిట్’ ధరించి స్టన్నింగ్ లుక్ లో కనిపిస్తుంది అషూ రెడ్డి. ఇక తన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus