‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ కు అస్వస్థత..!

Advertisement

అవును ఆ ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ అనారోగ్యం పాలైందట. దీంతో ఆసుపత్రికి తరలించారట సిబ్బంది. సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హిందీ ‘బిగ్ బాస్’ సీజన్‌ 13 లో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన బుల్లితెర నటి దేవోలీనా భట్టాచార్య గత కొద్ది రోజులుగా వెన్ను నొప్పితో బాధ పడుతుందట. దీంతో ఆమె షో నుండీ బయటకు వెళ్ళిపోవాలనుకుంటుందని టాక్ వస్తూనే ఉంది. ఇటీవల ఓ టాస్క్‌లో పాల్గొన్న సమయంలో దేవోలీనాకు వెన్నునొప్పి ఎక్కువైందట. దీంతో అప్పటి నుండీ ఈమె ఎటువంటి ఫిజికల్ టాస్క్‌లోనూ పాల్గొనడం లేదని తెలుస్తుంది.

‘బిగ్‌బాస్‌’ కూడా ఆమెను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరారట. హౌజ్‌లో ఉండే పనుల్లో పాల్గొనాలా వద్దా అనే నిర్ణయాన్ని కూడా ఆమెకే వదిలేశాడట. ఇక తాజాగా నొప్పి ఇంకా ఎక్కువకావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారట. ఇప్పుడు ఆమె హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. అయితే ఆమె ఆరోగ్యం కుదుటపడిన తర్వాతా తిరిగి షోలోకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె ఇంకా కోలుకోలేకపోవడంతో … ‘వాలెంటరీ ఎలిమినేషన్‌’ తీసుబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news