యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ షో తెలుగు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్టార్ మా ఛానల్ ల్లో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమం 16 టీఆర్పీ సాధించి రికార్డ్ సృష్టించింది. బిగ్ హౌస్ లోకి వెళ్లిన పార్టిసిపెంట్స్ ఎలిమినేట్ అయితే తప్పించి ఇష్టప్రకారం బయటికి వెళ్ళడానికి వీలు లేదు. 70 రోజుల పాటు హౌస్ లోనే ఉండాలి. కానీ సంపూర్ణేష్ బాబు ఈ నియమాన్ని అతిక్రమించారు. హోమ్ సిక్ తో బిగ్ హౌస్ లో వారానికి మించి ఉండలేకపోయారు.
మీ ఇష్టప్రకారం వెళ్లిపోవడం వాళ్ళ తమకు జరిగిన నష్టాన్ని భరించ వలసి ఉంటుందని అప్పుడే బిగ్ బాస్ సంపూని హెచ్చరించారు. అలా బిగ్ బాస్ ఎంత వారించినప్పటికీ వినకుండా.. ఏడుస్తూ షో నుంచి పక్కకు తప్పుకున్నారు. బిగ్ బాస్ షో నియమాల ప్రకారం సంపూకి నిర్వాహకులు ఫైన్ వేసినట్లు తెలిసింది. 16 లక్షలు కట్టాల్సినట్టుగా సంపూకి ఆర్డర్ వేసినట్లు సమాచారం. వారు చెప్పిన మొత్తం కడుతారా? లేదా? అనేది త్వరలో తెలియనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.