4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

నందమూరి కళ్యాణ్ రామ్.. మంచి టేస్ట్ ఉన్న హీరో. కెరీర్ ప్రారంభం నుండి ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశాడు. ‘అతనొక్కడే’ ‘పటాస్’ వంటి హిట్లు ఇతని ఖాతాలో ఉన్నాయి. ‘ఎం ఎల్ ఎ’ ‘118’ వంటి సినిమాలు కూడా డీసెంట్ గా ఆడాయి. కానీ తర్వాత చేసిన ‘ఎంత మంచి వాడవురా’ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో మార్కెట్ పరంగా వెనుకబడ్డాడు కళ్యాణ్ రామ్. అలాంటి టైమ్లో ‘బింబిసార'(Bimbisara) అనే సినిమా చేశాడు. మల్లిడి వశిష్ట్ ఈ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు.

Bimbisara

2022 ఆగస్టు 5న ‘బింబిసార’ రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ టైమ్లో జనాలు థియేటర్లకి రావడం లేదు అనే భయం.. మేకర్స్ లో, డిస్ట్రిబ్యూటర్స్ లో ఉండేది. ఆ భయాన్ని కూడా పోగొట్టి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది ‘బింబిసార’. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న నేపధ్యంలో.. బాక్సాఫీస్ వద్ద ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 11.83 cr
సీడెడ్ 8.08 cr
ఉత్తరాంధ్ర 4.89 cr
ఈస్ట్ 2.01 cr
వెస్ట్ 1.50 cr
గుంటూరు 2.28 cr
కృష్ణా 1.63 cr
నెల్లూరు 0.96 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 33.18 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.34 cr
ఓవర్సీస్ 2.40 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 37.92 cr

‘బింబిసార’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.37.92 కోట్ల షేర్ ని రాబట్టింది. బయ్యర్లకి ఏకంగా రూ.21.92 కోట్ల లాభాలు అందించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus