వైయస్సార్ బయోపిక్ కి రంగం సిద్ధం.!

  • March 21, 2018 / 08:21 AM IST

సమైక్య ఆంధ్రప్రదేశ్ ను ఎనిమిదేళ్లపాటు అత్యంత శక్తివంతమైన ముఖ్యమంత్రిగా పరిపాలించడంతోపాటు రైతన్నలకు ఆపన్న హస్తంగా చరిత్రలో నిలిచిపోయిన దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కించాలని పూరీ జగన్నాధ్, మధుర శ్రీధర్ రెడ్డి వంటి దర్శకులు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. వైయస్సార్ పాత్రలో రాజశేఖర్ నటిస్తాడనే వార్తలు కూడా వచ్చాయి. కానీ.. అవేమీ కార్యరూపం దాల్చలేదు.

కట్ చేస్తే. “పాఠశాల, ఆనందో బ్రహ్మ” చిత్రాల దర్శకుడు మహి వి.రాఘవ్ వైయస్సార్ బయోపిక్ కి దర్శకత్వం వహించే అవకాశాన్ని సొంతం చేసుకొన్నాడు. ఈ చిత్రానికి “యాత్ర” అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశాడు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించనున్న ఈ చిత్రం కోసం మిగతా నటీనటుల ఎంపిక జరుగుతోంది. అయితే.. బయోపిక్ కాబట్టి రాజశేఖర్ రెడ్డి బాల్యం నుంచి మొత్తం ఉండబోతుందా లేక “యాత్ర” అనే టైటిల్ పెట్టారు కాబట్టి రాజశేఖర్ ముఖ్యమంత్రి కావడంలో కీలకపాత్ర పోషించిన ఆయన చేసిన పాదయాత్ర నుంచి ప్రస్థానం మొదలవుతుందా అనేది తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus