Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Advertisement

యాక్షన్ కింగ్ అర్జున్ కొంత గ్యాప్ తర్వాత హీరోగా నటించిన సినిమా ‘బ్లాస్ట్ జోన్'(Blast Zone). అభిరామి… అర్జున్ కి జోడీగా నటించగా.. యంగ్ హీరోయిన్ ప్రీతీ ముకుందన్ అత్యంత కీలక పాత్రలో నటించింది. మే 29న చాలా సైలెంట్ గా రిలీజ్ అయ్యింది ఈ సినిమా.లోకేష్ కనగరాజ్, నెల్సన్, ప్రధీప్ రంగనాథన్ వంటి తమిళ స్టార్ దర్శకుల వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన సుభాష్ కె రాజ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. మొదటి షో నుండే సినిమాకి సూపర్ రెస్పాన్స్ లభించింది.

Blast Zone Collections

చాలా కాలం తర్వాత అర్జున్ కి సరైన సినిమా పడిందని ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు.తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ‘సితార’ నాగవంశీ రిలీజ్ చేశారు. అయితే ప్రమోషన్ పెద్దగా లేకపోవడంతో ‘బ్లాస్ట్ జోన్’ బాక్సాఫీస్ రన్ కి అంతగా కలిసి రాలేదు అని చెప్పాలి.రెండో రోజు నుండి పికప్ అయినప్పటికీ.. తర్వాత వీక్ డేస్ లో డౌన్ అయ్యింది. ఒకసారి ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.69 cr
సీడెడ్ 0.17 cr
ఆంధ్ర(టోటల్) 0.43 cr
ఏపీ +తెలంగాణ(టోటల్) 1.29 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్(తెలుగు వెర్షన్) 0.11 cr
వరల్డ్ వైడ్ టోటల్ 1.40 cr(షేర్)

‘బ్లాస్ట్ జోన్’ సినిమా(తెలుగు వెర్షన్)  రూ.1.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.1.40 కోట్ల షేర్ ను  రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.2.51 కోట్లు రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.0.40 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus