‘ప్యారడైజ్’ ప్రభావం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నాని.. ముందుగా అనుకున్న ప్రకారం ‘బ్లడీ రోమియో’ సినిమా పనులు స్టార్ట్ చేయాల్సి ఉంది. కానీ కొంత గ్యాప్ ఇచ్చి మొదలుపెడదాం అని అనుకున్నాడని సమాచారం. ఈ లోపు కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అలా ఓ మీడియాకు ఇచ్చిన ముఖాముఖిలో తన కొత్త సినిమాల గురించి కొన్ని వివరాలు వెల్లడించాడు. అలా ‘బ్లడీ రోమియో’ సినిమా గురించి వివరంగా చెప్పుకొచ్చాడు.
‘బ్లడీ రోమియో’ సంగతేంటి, సినిమా ఎలా ఉండబోతోంది అని అడిగితే.. ఇప్పుడిప్పుడే ఈ సినిమా గురించి మొత్తం వివరాలు చెప్పలేను. అయితే ఈ సినిమా వయలెన్స్ ఉంటుంది అని మాత్రం చెప్పగలను. అలా అని మొత్తంగా వయలెన్స్ మాత్రమే ఉంటుందదని అనడం లేదు. సినిమా చూడటానికి థియేటర్‌కి వచ్చినవారికి సరికొత్త ఎక్స్‌పీరియెన్స్ అయితే ఇస్తాం. స్టయిలిష్ సినిమాగా ఈ సినిమాను తీర్చిదిద్దుతాం.
ఈ సినిమా కథలో సుజీత్ ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ పెట్టారు. అది చమత్కారంగా ఉంటుంది. సుజీత్ స్టైల్‌లో యాక్షన్ ప్యాక్డ్ సినిమాను మీరు ఆశించొచ్చు. అలానే తెలుగు సినిమాలో ఇప్పటివరకు రాని తరహా సినిమా ఇది అని చెప్పాడు నాని. తాను రీసెంట్‌గా చేసిన ‘ప్యారడైజ్’ సినిమాకు దూరంగానే ఈ సినిమా ఉంటుందని చెప్పాడు. అంటే ‘ప్యారడైజ్’ ప్రభావం ఈ సినిమా మీద పడకుండా నాని జాగ్రత్త పడుతున్నాడు అని అర్థమవుతోంది.
‘బ్లడీ రోమియో’ సినిమా ఎక్కువ శాతంలో విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటుంది అని చెబుతున్నారు. ఈ సినిమాలో రోమియోకి జూలియెట్‌గా కనిపించబోయేది మీనాక్షి చౌదరి అని సమాచారం. ఏటా సంక్రాంకి వస్తున్న మీనాక్షి ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘అనగనగా ఒక రాజు’ అంటూ వరుస పండగలకు వరుస విజయాలు అందుకుంది. ఇప్పుడు నాగచైతన్యతో ‘వృషకర్మ’ సినిమా చేస్తోంది. ఈ సినిమా డిసెంబరులో రాబోతోంది.
నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్, యునానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను 2027 వేసవి కానుకగా విడుదల చేస్తారని సమాచారం. అయితే సినిమా షూటింగ్ మొదలయ్యే బట్టి ఈ డేట్ ఆధారపడి ఉంటుంది.