చిరుకి నో….ఎన్టీఆర్ కు సై!!!

  • February 8, 2017 / 06:08 AM IST

టాలీవుడ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరం ఊహించలేం….అసలైతే చిరు సినిమాలో గెస్ట్ పాత్ర ఇచ్చి….చిరు ఉన్న సీన్ లో కనిపిస్తే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు…..అయితే అదే క్రమంలో చిరుని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు…అలాంటి చిరుని కాదనడమే కాకుండా….జూనియర్ ఎన్టీఆర్ కి ఒకే చెప్పాడు ఒక నటుడు…ఇంతకీ ఎవరా నటుడు…ఏమా కధ అంటే…’నీల్ నితిన్ ముఖేష్’ ఈ ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు….తమిళ కత్తి సినిమాలో నటించి..పాత్రలో జీవించాడు…అయితే అదే క్రమంలో ఈ సినిమాలో ఈ విలన్ కు చాలా మంచి పేరు వచ్చింది..అయితే ఇదే నటుణ్ణి తన సినిమాలో అదే అండీ మెగా150 సినిమాలో విలన్ గా నటించేందుకు చిరు మంచి భారీ ఆఫర్ ఇచ్చాడు….అయితే ఎందుకు వద్దు అన్నాడో…ఏమో కానీ, మొత్తానికైతే ఆ విలన్ ఒప్పుకోలేదు….కారణాలు ఏవైనా…చిరుకు మాత్రం నో చెప్పాడు.

అంతవరకూ అయితే బాగానే ఉండేది…అసలు కధ ఇప్పుడే మొదలయింది…..విషయం ఏమిటంటే…‘జనతా గ్యారేజ్’ సంచలన విజయం తరువాత ఎన్నో కధలు విన్న జూనియర్ ఎన్టీఆర్ చిట్ట చివరకు  డైరెక్టర్ బాబీ చెప్పిన ఒక వెరైటీ కధ నచ్చడంతో ఆకధకు ఒకే చెప్పిన విషయం తెలిసిందే.  ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో  కళ్యాణ్ రామ్ తీస్తున్న ఈమూవీ షూటింగ్ ఈనెల 10వ తారీఖు నుండి ప్రారంభంకాబోతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంచేయడం ఒక ప్రత్యేక ఆకర్షణ. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో నీల్ నితిన్ ముఖేష్ నటించేందుకు ఒకే చెప్పాడట…దీనితో మెగా స్టార్ కు నో చెప్పిన బాలీవుడ్ యాక్టర్ ను జూనియర్ పట్టేసాడు అంటూ ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమా టైటిల్ ‘జై లవకుశ’ గా పెట్టాలని ఆలోచనలు చేస్తున్నట్లు టాక్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus