అల్లు అర్జున్ కోసం స్టెప్పులు కంపోజ్ చేయనున్న బాలీవుడ్ కొరియోగ్రాఫర్!

Advertisement

అల్లు అర్జున్ మొదటి నుంచే స్టెప్పులు అదరగొడుతారు. సినిమాకి సినిమాకి కొత్త కొత్త స్టెప్పులు, మూవెమెంట్స్ తో బెస్ట్ డ్యాన్సర్ గా పేరు తెచ్చుకున్నారు. అతని టాలీవుడ్ లోని టాప్ కొరియోగ్రాఫర్లందరూ డ్యాన్స్ కంపోజ్ చేశారు. బాలీవుడ్ వారు సైతం స్టైలిష్ స్టార్ కి కొత్త స్టెప్పులు అందించారు. తాజాగా అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు విజేత సరోకొత్త మూవీ మెంట్స్ చూపించనున్నారు. ఏక్తా టైగర్, ధూమ్ 3 , ఓకే ఝాను వంటి వందకు పైగా హిందీ చిత్రాలకు కొరియోగ్రఫీ చేసిన వైభవి మర్చంట్ బన్నీ సినిమా టీమ్ లో జాయిన్ అయ్యారు. ఆమె రెండు పాటలకు కొరియోగ్రఫీ అందించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అల్లు అర్జున్   కిక్, రేసు గుర్రం, టెంపర్ వంటి హిట్ చిత్రాలకి కథ అందించిన వక్కంతం వంశీ దర్శకత్వంలో  నాపేరు సూర్య సినిమా చేస్తున్నారు.

బన్నీ సోల్జర్ గా నటిస్తున్న ఇందులో హీరోయిన్ గా అనూ ఇమ్మాన్యుయేల్ అందాలు ఆరబోయనుంది. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ షూటింగ్‎ను పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్ మరోసారి హైదరాబాద్‎లో జరుగుతోంది. భారీ యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్నారు.  బాలీవుడ్  సంగీత దర్శక ద్వయం  విశాల్, శేఖర్  సంగీతమందిస్తున్న ఈ సినిమాని మెగా బ్రదర్  కె.నాగబాబు సమర్పిస్తుండడం విశేషం.   రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్, బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం  వచ్చే ఏడాది ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus