సుజీత్ కు బంపర్ ఆఫర్లు ఇస్తున్న బాలీవుడ్ హీరోలు?

  • September 6, 2019 / 06:49 PM IST

ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నప్పటికీ హిందీ ప్రేక్షకులను మాత్రం ఓ రేంజ్లో ఆకట్టుకుంటుంది. ఒక్క బాలీవుడ్ లోనే ఈ చిత్రం 120 కోట్ల వసూళ్ళను సాధించి తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచింది. ఈ చిత్రానికి అక్కడ మంచి రివ్యూలు అయితే అస్సలు రాలేదు. క్రిటిక్స్ ‘సాహో’ చిత్రం పై విమర్శల వర్షం కురిపించారు. అయితే అక్కడి ప్రేక్షకులు మాత్రం ఆ రివ్యూలను ఏమాత్రం పట్టించుకోకుండా థియేటర్ల వద్ద క్యూలు కడుతున్నారు. అంతేకాదు అక్కడ వీక్ డేస్ లో కూడా ‘సాహో’ మంచి వసూళ్ళను సాధిస్తున్నాడు.. దానికి కారణం రిపీట్ ఆడియన్స్ రావడమేనని ట్రేడ్ పండితులు చెప్పుకొస్తున్నారు.

‘సాహో’ ని సుజీత్ డైరెక్ట్ చేసిన తీరుకి అలాగే.. ప్రభాస్ తో చేయించిన యాక్షన్ సీన్లకి వాళ్ళు ఫిదా అయిపోయారు అంటే ఆశ్చర్యం లేదు. అక్కడి ప్రేక్షకులే కాదు… ఈ చిత్రం చూసిన కొంతమంది బడా స్టార్లు కూడా సుజీత్ కు ఫోన్ చేసి అభినందిస్తున్నారట. కుర్ర హీరోలు చాలా మంది సుజీత్ ను సంప్రదించి మంచి కథ ఉంటే చెప్పమని అదుగుతున్నారట. ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ తరువాత హిట్టుకి మొహం వాచిపోయిన బాలీవుడ్ బాద్ షా ‘షారుఖ్’ కూడా సుజీత్ ను సంప్రదించాడని సమాచారం. ‘మంచి కథ రెడీ చేయమని సుజీత్ కు చెప్పాడట. కరణ్ సూచనల మేరకే షారుఖ్ ఇలా సుజీత్ సంప్రదించాడట. కుదిరితే కరణ్ జోహార్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. ఏమైనా తెలుగు ప్రేక్షకులు తిప్పి కొట్టిన సినిమాని, డైరెక్టర్ ను హిందీ ప్రేక్షకులు అభినందించడం, ఆఫర్లు ఇవ్వడం వినడానికి చాలా విడ్డూరంగా ఉంది కదూ..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus