సూపర్ స్టార్ మహేష్ బాబుకి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే అక్కడి బ్యూటీలు మహేష్ తో కలిసి నటించడానికి పోటీ పడుతుంటారు. ఇక హిందీ దర్శకనిర్మాతలు కూడా మహేష్ డేట్స్ కోసం అనేక సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే తాజాగా అల్లు అర్జున్ కి కూడా బాలీవుడ్ లో పాపులారిటీ పెరిగిపోతోంది. సరైనోడు తర్వాత బన్నీ చేసిన దువ్వాడ జగన్నాధం సినిమా తెలుగులో విజయం సాధించలేదు. అయినా ఈ మూవీ హిందీ వెర్షన్ కి యూట్యూబ్ లో మంచి వ్యూస్ వచ్చాయి. అతని డ్యాన్సుల కోసమే హిందీ జనాలు ఈ సినిమాని పదే పదే చూసినట్లు సమాచారం. ఏంటి నమ్మలేకపోతున్నారా?.. స్వయంగా ఓ బాలీవుడ్ బ్యూటీ బన్నీపై కురిపించిన ప్రశంసలు తెలుసుకుంటే నమ్మి తీరాల్సిందే.
హిందీ లో తక్కువ సినిమాల ద్వారా నటిగా నిరూపించుకున్న హీరోయిన్ సోనాక్షి సింగ్ రావత్ ‘నా లవ్ స్టోరీ’ అనే మూవీతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. మహీధర్ హీరోగా నటించిన ఈ మూవీ ఈనెల 29 న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన సోనాక్షి బన్నీ, మహేష్ ల గురించి కామెంట్స్ చేసింది. “అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం. ముంబైలో బన్నీ ఎవరో తెలీనివాళ్లు కూడా.. అతని డాన్స్‌కి ఫ్లాట్ అయిపోతున్నారు. డీజే లోని పాటలతో పాటు ఇద్దరు అమ్మాయిలతో సినిమాలో ‘టాపు లేచిపోద్ది’ పాటకు బన్నీ వేసిన స్టెప్స్‌ని అమ్మాయిలు సైతం ఫాలో అవుతున్నారు” అని వివరించింది. తెలుగు హీరోల్లో మహేష్ బాబుకు డాన్స్ రాకపోయినా చూడ్డానికి చాలా బావుంటాడని.. మ్యాన్లీగా అనిపిస్తాడని సోనాక్షి చెప్పింది. మొత్తానికి తెలుగు హీరోల బలాలు, బలహీనతలు బాగానే తెలుసుకొని అడుగుపెడుతోంది. మరి ఇక్కడ ఎంతమేర రాణిస్తుందో తెలియాలి.