అజిత్ మాట నిలబెట్టుకున్నాడు : బోనీకపూర్

  • January 30, 2019 / 09:40 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రజినీకాంత్, విజయ్ లకు మాదిరే అజిత్ కి కూడా అదే రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో సందేహం లేదు. అలాంటి అజిత్ ఎక్కువగా అభిమానించే నటి శ్రీదేవి. ఇందుకోసమే ఆమె అడగ్గానే ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ అనే చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించాడు. ఆ సమయంలోనే బోణీ కపూర్ నిర్మాణంలో ఓ సినిమా చేయాలని శ్రీదేవి కోరిందట. ఇందుకోసమే ఇప్పుడు శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నాడు .. శ్రీదేవికి ఇచ్చిన మాటను ఈ చిత్రంతో నిలబెట్టుకుంటున్నారు అజిత్.

ఇటీవల బోనీకపూర్ మాట్లాడుతూ .. “హిందీలో వచ్చిన ‘పింక్’ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నాను. విద్యాబాలన్ .. శ్రద్ధా శ్రీనాథ్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తన మాతృభాష తమిళంలో అజిత్ హీరోగా ఓ సినిమా నిర్మించాలనేది శ్రీదేవి కల. తరచూ ఆమె నాతో ఈ మాట చెబుతూ ఉండేది. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ షూటింగ్ టైములో… ఇదేమాట అజిత్ తో కూడా ఆమె అంటే… తప్పకుండా చేస్తానని అజిత్ మాట ఇచ్చాడు. ఇప్పుడు ఈ చిత్రానికి ఆయన పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. అలా శ్రీదేవికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు .. ఆమె కలను నిజం చేస్తున్నాడు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ‘పింక్’ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను అజిత్ చేస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus