ముందు జాగ్రత్తగా టైటిల్ రిజిస్టర్ చేయించాం : బోనీ కపూర్

  • January 12, 2019 / 12:32 PM IST

ప్రస్తుతం తెలుగు,హిందీ, తమిళ చిత్ర రంగాలు బ‌యోపిక్‌ల పై సృష్టి పెట్టాయి. ఇప్పటికే సిల్క్ స్మిత బయోపిక్ ‘డర్టీ పిక్చర్’, సంజయ్ దత్ ‘సంజు’, ‘ఎం.ఎస్.ధోని’ ‘మహానటి’ వంటి చిత్రాలు సంచలన విజయాల్ని నమోదు చేసాయి. తాజాగా విడుదలైన ‘ఎన్టీఆర్ బయోపిక్’ అయిన ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ చిత్రం కూడా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇంకా ‘ఎన్టీఆర్ మహానాయకుడు’, వై.ఎస్.ఆర్ బయోపిక్ అయిన ‘యాత్ర’, జయలలిత బయోపిక్ లతో పాటు పలువురు రాజ‌కీయ నాయ‌కులు, క్రీడాకారుల జీవితాలని లైన్లో పెట్టారు కొందరు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలో అతిలోక సుందరి ‘శ్రీదేవి బయోపిక్’ కూడా రాబోతుందంటూ గతంలో వార్తలు వచ్చాయి.

తాజా ఈ వార్తల పై ఆమె భర్త బోనీ కపూర్ క్లారిటీ ఇచ్చాడు. శ్రీ‌దేవి బ‌యోపిక్ తీయాలనే ఆలోచ‌న ప్ర‌స్తుతానికి లేదంటూ చెప్పడం విశేషం. బోనీ కపూర్ స్పందిస్తూ… ”ఇప్పటి వరకు వ‌ర‌కూ మేం శ్రీ‌దేవి బ‌యోపిక్ గురించి ఆలోచించ‌లేదు. క‌థ సిద్ధ‌మైంద‌న్న వార్త‌ల్లో ఏమాత్రం నిజం లేదు. అయితే ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేం.! భ‌విష్య‌త్తులో ఎలాంటి సినిమాలైనా రావొచ్చు” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే.. టైటిల్ ఎందుకు రిజిస్ట‌ర్ చేయించారు? అని అడిగిన ప్రశ్నకు .. ”కాపీ రైట్‌స‌మ‌స్య ఈ రోజుల్లో చాలా ఉంది కాబట్టి… ముందు జాగ్ర‌త్త‌గా టైటిల్‌ని రిజిస్ట‌ర్ చేయించి ఉంచాం” అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక శ్రీ‌దేవి జీవితంలో చాలా సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆమె బాల్యం నుండీ క‌థానాయిక‌గా ఎదిగే వరకు ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు ఎన్నో…! బోనీ కపూర్ ని వివాహం చేసుకోవడానికి చోటు చేసుకున్న కారణాలు… ఇలా చాలా అంశాలు.. ఈ బయోపిక్ లో ఉండే అవకాశం ఉండే అవకాశం ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus