“ఆగడు” తర్వాత “బ్రూస్ లీ” హిట్టయి ఉన్నా.. శ్రీను వైట్ల రేంజ్ వేరేలా ఉండేది. కానీ రెండూ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ కావడంతో డైరెక్టర్ గా శ్రీను వైట్ల గ్రాఫ్ ఘోరంగా పడిపోయింది. అందువల్లే ఇప్పుడతను వరుణ్ తేజ్ తో సినిమా చేస్తున్నాడు. లేకుంటే, మళ్ళీ మహేష్ బాబుతోనో లేక మరో పెద్ద హీరోతోనే సినిమా తీస్తుండేవాడు.
“డీ, రెడి, దుబాయ్ శీను, దూకుడు” వంటి బ్లాక్ బస్టర్స్ కలిగిన శ్రీను వైట్ల.. ఇప్పుడు తనతో సినిమా చేసేందుకు టాప్ హీరోలెవరూ ఆసక్తి చూపించకపోతుండడాన్ని చాలా అవమానంగా ఫీలవుతున్నాడు. అందుకే.. వరుణ్ తేజ్ తో తీస్తున్నసినిమాతో.. ఎట్టి పరిస్థితుల్లో సూపర్ హిట్ కొట్టాలనే కసి మీదున్నాడని తెలుస్తోంది.
వరుణ్ తేజ్ తోలి చిత్రం “ముకుంద” మరీ అంత మంచి ఫలితాన్నివ్వలేకపోయింది. రెండో చిత్రం “కంచె” ఫరవలేధనిపించుకోగా.. మూడో చిత్రం “లోఫర్” విషయంలో ఇప్పుడు జరుగుతున్న పంచాయితీ అందరికీ తెలిసిందే. అందువల్ల వరుణ్ తేజ్ కి అర్జెంట్ గా ఓ హిట్టు అవసరం. మరి శ్రీను వైట్ల కసి.. వరుణ్ తేజ్ కి ఎంతవరకు కలిసొస్తుందో వేచి చూడాలి !!