బోయపాటి ముహూర్తం రేపే!

  • November 20, 2016 / 06:37 AM IST

‘సరైనోడు’ సినిమా విడుదలైన చాలా రోజుల వరకు హీరో దర్శకులిద్దరూ తర్వాతి సినిమాలను మొదలెట్టనే లేదు. దర్శకుడు బోయపాటి కంటే ఓ అడుగు ముందేసిన బన్నీ ప్రస్తుతం ‘దువ్వాడ జగన్నాధం’ సినిమా పనుల్లో పడ్డాడు. బోయపాటి కూడా షూటింగ్ తో బిజీ అయ్యేందుకు సన్నద్దమయ్యారట.

సీనియర్ హీరోలతో మాత్రమే బోయపాటి సినిమాలు తీస్తారు అన్న అపవాదుని పోగొట్టుకునేందుకు వరుసగా యువ హీరోలతో ప్లాన్ చేశాడు బోయపాటి శ్రీను. ఆకోవలోనే బన్నీతో సినిమా చేసి హిట్ కొట్టిన ఈ దర్శకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపటి నుండి జరుగనుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అలనాటి నటుడు శరత్ బాబు, శ్రీనివాస్ తండ్రి పాత్రలో కనపడనుండటం విశేషం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus