కల్యాణ్‌రామ్‌తో బోయపాటి.. వాట్‌ ఏ కాంబినేషన్‌ గురూ

  • April 18, 2021 / 03:39 PM IST

నందమూరి హీరోలతో బోయపాటి సినిమా అంటే ఆ క్రేజే వేరబ్బా. బాలకృష్ణతో రెండు బంపర్‌ హిట్లు కొట్టి… మూడో హిట్‌ కోసం త్వరలో ‘అఖండ’గా ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతున్నాడు. మరి ఈ సినిమా తర్వాత ఏంటి? అనే ప్రశ్న చాలా మంది వచ్చే ఉంటుంది. అయితే దీనికి సమాధానంగా చాలా పుకార్లు వినిపించాయి. అయితే అవేవీ ఓకే అయ్యేలా కనిపించడం లేదు. ఈలోగా తాజాగా మరో పుకారు బయటకు వచ్చింది. ఆ పుకారులోని హీరోను చూస్తే… ఈ విషయం పుకారు నుండి వార్తగా ప్రమోట్‌ అయ్యేలా కనిపిస్తోంది.

‘అఖండ’ తర్వాత బోయపాటి అఖిల్‌తో ఓ సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి. అయితే సురేందర్‌ రెడ్డి సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది. సో అఖిల్‌ ఛాన్స్‌ లేదు. ఇక ‘సరైనోడు’ అల్లు అర్జున్‌తో బోయపాటి సినిమా అన్నారు. అయితే బన్నీ వేరే ఆలోచనల్లో ఉన్నాడని సమాచారం. దీంతో నెక్స్ట్‌ ఏంటి అనే క్వశ్చన్‌ బోయపాటి క్యాంపును అడిగితే… కళ్యాణ్‌ రామ్‌ అనే పేరు వినిపిస్తోంది. కళ్యాణ్‌ రామ్‌ కోసం బోయపాటి ఓ కథ సిద్ధం చేస్తున్నాడట.

నిజానికి కళ్యాణ్‌ రామ్‌తో బోయపాటి అని చాలా రోజుల క్రితం ఒకసారి పుకార్లు వచ్చాయి. అయితే ఆ తర్వాత కరోనా పరిస్థితుల కారణంగా పెద్దగా వినిపించలేదు. తర్వాత ఎవరి సినిమాల్లో వారు బిజీ అయిపోయారు. ఇప్పుడు పూర్తి స్థాయి యాక్షన్‌ ఫిల్మ్‌ను కళ్యాణ్‌ రామ్‌ కోసం సిద్ధం చేస్తున్నాడట. అయితే తమ్ముడుకు ఎన్టీఆర్‌ ‘దమ్ము’ను చూపించిన బోయపాటి.. ఇప్పుడు అన్న కళ్యాణ్‌రామ్‌కు ఎలాంటి కథ ఇస్తాడో మరి.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus