మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ధృవ సినిమాతో హిట్ అందుకోగా.. రంగస్థలంతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 200 కోట్ల గ్రాస్ వసూలు చేసి మెగా హీరో సత్తాని చాటింది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బీభత్సం సృష్టించడానికి సిద్ధమయ్యారు. ఈ మూవీ రెండో షెడ్యూల్ లో చెర్రీ పాల్గొన్నారు. బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా పేర్లు ఇవేనంటూ కొన్ని రోజులుగా చక్కర్లు కొట్టాయి. గత చిత్రానికి జయ జానకి నాయక అని పేరు పెట్టి ఆకర్షించిన బోయపాటి ఇందుకు ‘రాజవంశస్థుడు, రాజమార్తాండ’ వంటి టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపించింది.
అయితే ఈ వార్తలను చిత్ర బృందం ఖండించింది. ఇంకా టైటిల్ ని ఖరారు చేయలేదని స్పష్టం చేసింది. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కి అన్నయ్యలుగా తమిళ హీరో ప్రశాంత్ (జీన్స్ హీరో), నవీన్ చంద్ర(అందాల రాక్షసి), ఆర్యన్ రాజేష్ (సొంతం) నటించనున్నారు. చెర్రీ కి వదినలుగా అలనాటి హీరోయిన్ స్నేహ, అనన్య (‘జర్నీ’ ఫేం), హిమజలు కనిపించనున్నారు. “భరత్ అనే నేను” బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.