ట్విట్టర్ వేదికపై షాకింగ్ నిజం తెలిపిన బ్రహ్మాజీ

  • April 22, 2017 / 07:43 AM IST

సినీ తారల ప్రొఫిషనల్ విషయాలు, వ్యక్తిగత సంగతులు వారు చెప్పేదానికంటే ముందు మీడియా వారు రాసేస్తుంటారు. మంచి కంటే ముందు చెడు మరింత వైరల్ అవుతుంది. అది సెలబ్రిటీలను మరింత బాధ కలిగిస్తుంది. అటువంటి తలనొప్పి లేకుండా ఉండాలని సినీ నటుడు బ్రహ్మాజీ తన కుటుంబ సభ్యుల సంగతిని అందరికీ చెప్పారు. ట్విట్టర్ వేదికపై కొడుకు వివాహ బంధం గురించి బయటపెట్టారు. ఈ వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

‘ఈ విషయాన్నీ చెప్పడానికి బాధగా ఉంది. నా కుమారుడు సంజయ్, అతని భార్య ఇంద్రాక్షి గత 5 నెలలుగా విడిపోయి బతుకుతున్నారు. వాళ్లిద్దరూ త్వరలోనే విడాకులు కూడా తీసుకుంటారు. ఈ జంట విడిపోయాక మరో ఆనందకర జీవితం ప్రారంభించాలని కోరుకుంటున్నాను” అని పోస్ట్ చేశారు. ఫ్యాషన్ డిజైనర్ అయిన ఇంద్రాక్షి ని మూడేళ్ళ క్రితం సంజయ్ పెళ్లి చేసుకున్నాడు. ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఏమిటని ఆరాతీస్తున్నారు. అయితే త్వరలో సంజయ్ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ విషయాన్నీ బ్రహ్మజీ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus