డీలా పడ్డ ‘బ్రహ్మోత్సవం’ కలెక్షన్లు..

  • May 23, 2016 / 03:20 PM IST

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’. మే 20 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.13 కోట్లు వసూలు చేయగా,, మొదటి వారం లో రూ.31 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఓవర్సీస్ లో ఈ చిత్రం మిలియన్ మార్క్ క్రాస్ చేయగా.. మొత్తం మీద మొదటి వారంలో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.39 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

మరోవైపు ఈ చిత్ర థియేట్రికల్ హక్కులు దాదాపు రూ.71 కోట్లకు అమ్ముడైయ్యాయని..ఈ చిత్రానికి నెగెటివ్ టాక్ రావడంతో చిత్రాన్ని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. కాగా బ్రహ్మోత్సవం చిత్రానికి  థియేటర్ ఆక్యుపెన్సీ 50 శాతం కూడా మించడం లేదని యాజమాన్యాలు వాపోతుండటం గమనార్హం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus