రామ్ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) నుంచి ‘బ్రేవ్ హార్ట్స్’ పాట విడుదల

నిజ జీవిత కథలను తెరపై ఆవిష్కరిస్తే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ఈ మధ్యకాలంలో దర్శకనిర్మాతలతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఇలాంటి స్టోరీలపైనే మక్కువ పెరుగుతోంది. రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందకు రామ్‌ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే చిత్రం రాబోతోంది. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా రామ్‌ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే సినిమా రూపొందిస్తున్నారు.

దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలోని బ్రేవ్ హార్ట్స్ అంటూ సాగే ఓ దేశ భక్తి గీతాన్ని రిలీజ్ చేశారు. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఈ పాటకు సాహిత్యాన్ని రాము కుమార్ ఏ ఎస్ కే అందించగా.. ఆశ్రిత్ అయ్యంగార్ బాణీ ప్రతీ ఒక్కరిలో దేశభక్తిని తట్టిలేపేలా ఉంది.

దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయజుల హీరోగా పరిచయం కాబోతున్నారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. ధన్య బాలకృష్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆశ్రిత్ అయ్యంగార్ సంగీతం అందిస్తుండగా.. ధారణ్ సుక్రి డిఎసి సినిమాటోగ్రఫీ వర్క్ చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus