నా పేరు సూర్య తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మంచి కథని సెలక్ట్ చేసుకున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ప్రస్తుతం అల్లు శిరీష్ “ఏబీసీడీ” అనే సినిమాని చేస్తున్నారు. ఆ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ అల్లు హీరోలు, వారి టీమ్ మాత్రం కథల వేటలో, కొత్త ట్యాలెంట్ ని పట్టుకునే వేటలోనే ఉంది. రీసెంట్ గా గీతా ఆర్ట్స్ బ్యానర్లో వచ్చిన గీత గోవిందం సూపర్ హిట్ అయింది. తమ నిర్ణయంపై బలం చేకూరింది. అందుకే అల్లు అరవింద్ తన బృందాన్ని అభినందించారు. అలాగే టీమ్ సెలక్ట్ చేసిన దర్శకులకు, కథలకు అడ్వాన్సులు ఇస్తున్నారు.
అలా అడ్వాన్స్ లు తీసుకున్న వారిలో మురుగదాస్ దగ్గర శిష్యరికం చేసిన సింథిల్ ఒకరు. ఇతను చెప్పిన రెండు కథలు నచ్చడంతో.. అది తమ బ్యానర్లోనే తీయాలని అల్లు అరవింద్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఈ సారి మంచి కథలను ఇతర హీరోలకు ఇవ్వకుండా అల్లు అర్జున్, శిరీష్ అలీతో నిర్మించాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ముందుగా శిరీష్ ని డైరక్ట్ చేయమని అల్లు అరవింద్ సింథిల్ కు చెప్పినట్టు టాక్. అతని సినిమాకోసమే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. తమ్ముడి సినిమా అవుట్ ఫుట్ చూసి సింథిల్ దర్శకత్వంలో నటించాలా ? వద్దా? అనే నిర్ణయం అల్లు అర్జున్ తీసుకోనున్నారు. మొత్తానికి సింథిల్ జాక్ పాట్ కొట్టారు. హిట్ కొడితే.. మెగా హీరోలతో బిజీ అయిపోవడం ఖాయం.