పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అత్తారింటికి దారేది నిలిచింది. ఈ మూవీ కలక్షన్ల పరంగా వార్తల్లో నిలవడమే కాదు.. ఆ చిత్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ పై పవన్ ఫిర్యాదు చేయడం కూడా టీవీల్లో హెడ్ లైన్స్ లో వచ్చాయి. ఆ నిర్మాత నిర్మించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ‘అత్తారింటికి దారేది’ సినిమాకు సంబంధించి తనకు బాకీ పడ్డ డబ్బుల కోసం ప్రసాద్ మీద ఫిర్యాదు చేయడం అప్పుడు పెద్ద సంచలనమే అయింది. ఆ తర్వాత దీనిపై ఎవరూ స్పందించలేదు. అదే నిర్మాణంలో ఇప్పుడు “ఇంట్లో దెయ్యం నాకేం భయం” వస్తోంది.
ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ మీడియా ముందుకు వచ్చారు. దేంతో అసలు గొడవ ఏమిటని ఆయన్ను విలేకరులు ప్రశ్నించారు. ‘‘నేను పవన్ కళ్యాణ్ గారికి కొంత అమౌంట్ ఇవ్వాలి. అది ఆలస్యమైంది. అయినా అలా ఎందుకు జరిగిందో నాకు ఇప్పటికీ అర్ధం కావడం లేదు. ఆయన నన్నేమీ ఇబ్బంది పెట్టలేదు. నేనే ఇబ్బంది పడ్డాను. నేను ఆ సమయంలో అలాంటి పరిస్ధితిలో ఉండడం నా దురదృష్టం” అని ఆయన వివరించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.