బిగ్ బాస్ 4: టాస్క్ లో బెస్ట్ ఎవరు..?

  • November 5, 2020 / 12:31 PM IST

బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం ఇచ్చిన కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో అందరూ బాగా ఆకట్టుకుంటున్నారు. ఈసారి పెర్ఫామెన్స్ చేసే స్కోప్ అందరికీ దొరికింది. ముఖ్యంగా హారికకి ఇచ్చిన సీక్రట్ టాస్క్ హైలెట్ అనే చెప్పాలి. ఇప్పటికే ఒక టాస్క్ ని విజయవంతంగా పూర్తి చేసింది హారిక. అయితే, ఈ టాస్క్ లో అసలు గెలిచింది ఎవరు…? కెప్టెన్సీ పోటీదారులు అయ్యింది ఎవరు ? అనేది ఆసక్తికరంగా మారింది. టాస్క్ ని బట్టీ చూస్తే ఇప్పటివరకూ బెస్ట్ పెర్ఫామ్ ఇచ్చింది హారిక మాత్రమే. ఎందుకంటే సీక్రట్ టాస్క్ ఆడుతునే మల్లి అనే క్యారెక్టర్ లో ఇన్వాల్ అయిపోయింది. కాబట్టి, ఖచ్చితంగా బిగ్ బాస్ సీక్రట్ టాస్క్ గెలిస్తే హారికని కెప్టెన్సీ రేస్ లో పెడతాడు. హారిక తర్వాత ఈ టాస్క్ లో అరియానా పెర్ఫామెన్స్ ఇరగదీసిందే చెప్పాలి. కొంటెపిల్లగా అందర్నీ ఆకట్టుకుంటూ, అవినాష్ ని ఆటపట్టిస్తూ చాలాబాగా యాక్ట్ చేసింది. సో, అరియానా కూడా కెప్టెన్సీ టాస్క్ లో ఉంటుంది.

ఇక లాస్ట్ వీక్ ఇచ్చిన స్పెషల్ పవర్ తో అమ్మరాజశేఖర్ కూడా కెప్టెన్సీ టాస్క్ లో ఉంటాడు. అయితే, ఇప్పుడు ఈ ముగ్గురికి ఎలాంటి టాస్క్ పెడతారు అనేది ఆసక్తికరం. ఒకవేళ హౌస్ మేట్స్ సపోర్ట్ తో కెప్టెన్ డిసైడ్ అవ్వలి అంటే రేస్ లో ఖచ్చితంగా అరియానా ఉండదు. ఎందుకంటే, ఇప్పుడు ఇంటి కెప్టెన్ అరియానే కాబట్టి వరుసగా రెండోసారి కెప్టెన్ చేయాలని హౌస్ మేట్స్ అనుకోరు. ఒకవేళ ఏదైనా టాస్క్ అయితే మాత్రం ఖచ్చితంగా పోరాడుతుంది.

ఇక హారికకి ఇంటిసభ్యుల సపోర్ట్ చాలా తక్కువ. కేవలం అభిజిత్ అండ్ లాస్య ఇద్దరు మాత్రమే సపోర్ట్ చేస్తారు. మహా అయితే అఖిల్ అండ్ మోనాల్ జాయిన్ అవ్వొచ్చు. అది కూడా చెప్పలేం. అఖిల్ న్యూట్రల్ గా ఉంటాడు. లేదా మోనాల్ న్యూట్రల్ గా ఉంటుంది. ఇక అమ్మరాజశేఖర్ కి ఇంట్లో సపోర్ట్ ఎక్కువ. మెహబూబ్, సోహైల్, అవినాష్, కుదిరితే మోనాల్ కూడా అమ్మకే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే నామినేషన్స్ అప్పుడు నీకు నేను ఉన్నాను అని చెప్పాడు కాబట్టి. సో హౌస్ మేట్స్ తో కలిసిన ఫిజికల్ టాస్క్ వస్తే మాత్రం ఖచ్చితంగా అమ్మరాజశేఖర్ మాస్టర్ కెప్టెన్ అవుతారు. అలా కాకుండా, లాస్ట్ టైమ్ మోనాల్ హారిక యాపిక్ కట్ చేసి తనకి అవకాశం లేకుండా చేసింది కాబట్టి ఓటింగ్ లో సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా హారిక కెప్టెన్ అవుతుంది.

మరి హారిక కెప్టెన్ అయ్యిందా లేదా అమ్మరాజశేఖర్ మాస్టర్ కెప్టెన్ అయ్యాడా అనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ద సోషల్ మీడియా అయ్యింది. అదీ మేటర్.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus