‘తమ్ముడు’ (Thammudu) సినిమాకు రూ.75 కోట్ల వరకు బడ్జెట్ అయ్యింది. నితిన్ గత సినిమా ‘రాబిన్ హుడ్’ (Robinhood) కి రూ.70 కోట్లు బడ్జెట్ పెట్టారు. దానికి సగం బడ్జెట్ కూడా రికవరీ కాలేదు. అయినా సరే దిల్ రాజు (Dil Raju) ‘తమ్ముడు’ (Thammudu) కి దానికి మించి బడ్జెట్ పెట్టారు. ఇందులో కూడా నితిన్ కి, దర్శకుడు వేణుకి పారితోషికం పూర్తిగా ఇవ్వలేదు అని దిల్ రాజు స్టేజిపైనే చెప్పారు.
వాళ్లకు మాత్రమే కాదు.. సినిమాలో నటించిన చాలా మందికి పారితోషికం పూర్తిగా చెల్లించలేదు అనే టాక్ కూడా వినిపించింది. ఈ సినిమా నటీనటుల పారితోషికాలు కాకుండా కేవలం.. మేకింగ్ కాస్ట్ కే రూ.35 కోట్లు బడ్జెట్ అయ్యిందట. సినిమా వర్కింగ్ డేస్ 150 రోజులు జరిగినట్లు తెలుస్తుంది.
‘తమ్ముడు’ (Thammudu) థియేట్రికల్ బిజినెస్ అనుకున్న స్థాయిలో జరగడం లేదు. అడ్వాన్స్ బేసిస్ పై ఆంధ్రాలో రిలీజ్ చేస్తున్నారు. నైజాంలో చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు అని తెలుస్తుంది. ఓటీటీ డీల్స్ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వాళ్ళతో చర్చలు నడుస్తున్నాయి.
‘తమ్ముడు’ (Thammudu) ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ హైప్ క్రియేట్ అవ్వలేదు. జూలై 4న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కచ్చితంగా పాజిటివ్ టాక్ తెచ్చుకోవాలి. అప్పుడే జనాలు థియేటర్లకు కదిలి వస్తారు.. సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. నిర్మాత దిల్ రాజు కూడా సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.