Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

వైవిధ్యమైన సినిమాలు డైరెక్ట్ చేయడమే కాకుండా విలక్షణ నటుడిగా కూడా ఎదిగారు సముద్రఖని. ఓ పక్క వరుసగా పెద్ద సినిమాల్లో నటిస్తూనే మరోపక్క కంటెంట్ ఉన్న సినిమాల్లో లీడ్ రోల్స్ కూడా చేస్తూ వస్తున్నారు.

Carmeni Selvam Teaser

సముద్రఖని టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ మూవీ ‘కార్మేని సెల్వం’. ‘పాత్‌వే ప్రొడక్షన్స్’ సంస్థపై అరుణ్ రంగరాజులు నిర్మించిన ఈ చిత్రాన్ని రామ్ చక్రి దర్శకత్వం వహించారు.

ద్విభాషా చిత్రంగా రూపొందిన ‘కార్మేని సెల్వం’(Carmeni Selvam) తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో అంటే ఏప్రిల్ 3న విడుదల కానుంది.సముద్రఖనితో పాటు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో పోషించడం విశేషం. అలాగే లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ వంటి వారు కూడా ముఖ్య పాత్రలు పోషించారు.పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు టీజర్ ను వదిలారు.1:15 నిమిషాల నిడివి కలిగిన ‘కార్మేని సెల్వం’ టీజర్లో ప్రెజెంట్ లైఫ్ స్టయిల్ ను.. ముఖ్యంగా డబ్బు సంపాదించడం.. దాన్ని రెట్టింపు చేసుకోవడానికి రకరకాల వాటిల్లో ఇన్వెస్ట్మెంట్లు చేసి మోసపోతున్న సందర్భాలను చూపించారు. అవి రియాలిటీకి చాలా దగ్గరగా అనిపిస్తాయి.అందువల్ల చాలా మంది టీజర్..కి కనెక్ట్ అవ్వడమే కాకుండా వెంటనే 2వ సారి రిపీట్ మోడ్లో చూసే అవకాశం కూడా ఉంది.

అధిక ఖర్చులు, భారీ లోన్లు, క్రిప్టో పెట్టుబడులు, లగ్జరీల కోసం క్రెడిట్ కార్డ్ స్వైపింగ్..లు వంటి అన్నీ అంశాలని టీజర్లో ప్రస్తావించారు. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ కి కూడా పెద్దపీట వేశారు అనిపిస్తుంది. ‘ధనం కావాలంటే.. ధనవంతుడిలా ఖర్చుపెట్టాలి.. అందుకు డబ్బు లేకపోతే అప్పు చేసి అయినా ఖర్చుపెట్టాలి’ అంటూ వచ్చే డైలాగ్ వెంటనే అందరిమైండ్లోకి దూసుకుపోవడం ఖాయం అనే చెప్పాలి.ఇక  ‘కార్మేని సెల్వం’ టీజర్ ని మీరు కూడా ఓ లుక్కేయండి :

ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus