బాహుబలి కంక్లూజన్ ని చూసిన ప్రతి ఒక్కరూ దర్శకుడు రాజమౌళిని, నిర్మాతలు శోభు, ప్రసాద్ లను అభినందిస్తుంటే.. అరె కటిక సామజిక వర్గ ప్రజలు మాత్రం వారిపై కేసు పెట్టారు. వినడానికి విచిత్రం గా ఉన్నప్పటికీ ఇది నిజం. బాహుబలి 2 లో “కటిక చీకటి” అనే మాటను వాడారని, అందువల్ల తమ సామాజిక వర్గానికి చెందిన వారి మనోభావాలు దెబ్బతిన్నాయని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో బాహుబలి చిత్ర బృందంపై అరె కటిక సమాజ నాయకులు ఫిర్యాదు చేశారు.
రాజమౌళి తక్షణం తమ వర్గానికి క్షమాపణ చెప్పాలని, అలాగే చిత్రంలోంచి ఆ డైలాగ్ ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే అలా చేయకుంటే రాజమౌళి ఇంటిని ముట్టడిస్తామని, బాహుబలి థియేటర్ ల వద్ద ధర్నాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే అరె కటిక సంఘం ఇచ్చిన ఫిర్యాదు ని, ఏ సెక్షన్ లో కేసు నమోదు చేయాలో పోలీసులు న్యాయసలహా తీసుకుంటున్నారు. మరి దీనిపై రాజమౌళి అండ్ టీమ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.