96 రీమేక్ లో జూనియర్ శర్వా కోసం క్యాస్టింగ్ కాల్

  • January 28, 2019 / 08:20 AM IST

తమిళంలో ఘన విజయం సొంతం చేసుకోవడమే కాక యావత్ సినిమా అభిమానులను విశేషంగా ఆకట్టుకొన్న చిత్రం “96”. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో నాని, సమంత జంటగా రీమేక్ చేసేందుకు దిల్ రాజు ప్లాన్ చేసినప్పటికీ.. నాని ఒప్పుకోకపోవడంతో అతడి స్థానంలో శర్వానంద్ ను తీసుకొని నిన్న అఫీషియల్ గా ప్రొజెక్ట్ ను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఎనౌన్స్ మెంట్ అనంతరం కూడా సినిమా కథను మారుస్తున్నారని, ఒరిజినల్ వెర్షన్ తరహాలో స్కూల్ ఎపిసోడ్ కాకుండా.. కాలేజ్ ఎపిసోడ్ ను యాడ్ చేస్తున్నారని, అందువల్ల తమిళ వెర్షన్ ఫార్మాట్ లో ఉన్నట్లుగా వేరే జంట అవసరం లేదని టాక్ స్ప్రెడ్ అయ్యింది.

మరి ఆ వార్తలకు స్వస్తి పలకాలనుకున్నారో లేక నిజంగానే కొత్తవాళ్ళకు అవకాశం ఇవ్వాలనుకున్నారో తెలియదు కానీ.. “యంగ్ శర్వానంద్” కావాలి అని క్యాస్టింగ్ కాల్ ఇచ్చారు. సో, ఇండైరెక్ట్ గా సేమ్ టు సేమ్ రీమేక్ చేస్తున్నామని చెప్పకనే చెప్పారు దిల్ర్ ఆజు & టీం. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనున్న ఈ చిత్రానికి ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. ఈ ఏడాది దసరా కల్లా విడుదల చేసేందుకు దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus