చిరు విషయంలో తప్పుచేసిన క్యాధరిన్!!!

  • October 19, 2016 / 06:29 AM IST

టాలీవుడ్ లో మెగాస్టార్ టీ ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు…మెగా150 షూటింగ్ శేరవేగంగా జరిగిపోతుంది…చక చకా పనులన్నీ అయిపోతున్నాయి…అదే క్రమంలో సంక్రాంతి బరిలో చిరు 150వ సినిమా నిలవనుంది అన్న వార్త అభిమానుల గుండెల్లో ఆనందాన్ని నింపేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ కోసం జరిగిన గొడవ అంతా ఇంత కాదు అనే చెప్పాలి….ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ కోసం తొలుత అందాల భామ క్యాథరీన్ ను అనుకున్నారు…కానీ కాస్ట్యూమ్స్ విషాయంలో కాస్త తేడా రావడంతో ఆమె ఈ పాటకు నో చెప్పేసింది….ఇక అదే స్థానంలో….మన లక్ష్మి రాయ్ రంగంలోకి దిగింది….ఈ పాటకు సెలెక్ట్ అయ్యి హల్‌చల్ చేస్తుంది.

అదే విధంగా ఇప్పుడు ఆన్‌లైన్ లో కూడా హంగామా చేస్తుంది. ”సర్దార్ గబ్బర్ సింగ్” టైములో తాను చేసే ఐటెం సాంగు తాలూకు ఫోటోలను రిలీజ్ చేసేసి తౌబా తౌబా అంటూ కుర్రాళ్లను మెలికలు తిప్పించేసిందో.. ఇప్పుడు సేమ్ ”ఖైదీ నెం 150” విషయంలో కూడా అదే ప్యాట్రన్ ఫాలో అయిపోతోంది. ఫోటోలు మీద ఫోటోలు షేర్ చేస్తూ తెగ ఆనందపడుతోంది. అయితే లంగా ఓణిలో మెరిసి పోతున్న మన లక్ష్మి రాయి ఐటమ్ పాటలో వేసుకున్న ఈ డ్రెస్ విషయంలో మన క్యాథరిన్ ఎందుకంత గొడవ చేసిందో తెలీదు…పింక్ రంగు జాకెట్లో రక రకాల హంగులు అద్డారు. అదే విధంగా క్రింద వేసుకునే స్కర్టుకు కూడా చమీచమ్కీల పువ్వల డిజైన్లతో మిరుమిట్లు గొలిపేలా డిజైన్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత ఈ డిజైన్లను చేసింది. ఈ డ్రెస్ లో ఏమాత్రం ప్రాబ్లమ్ కాదు కాదు కదా…కనీసం ఎక్స్‌పోసింగ్ కూడా లేకపోవడం చూస్తుంటే….పాపం క్యాథెరిన్ మంచి అవకాశాన్ని వదిలేసుకుంది అని తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus