ఒకే రోజు పుట్టి ప్రపంచాన్ని ఏలుతున్న స్టార్స్ ఎవరంటే..?

  • November 7, 2022 / 06:44 PM IST

సాధారణంగా ఏదైనా ఒకేరోజు కొంతమంది పుట్టడం అనేది కామన్.. మనకి తెలిసివాళ్లు, రిలేటివ్స్, ఫ్రెండ్స్.. ఇలా ఎవరైనా సేమ్ డేట్‌న పుడితే.. ‘‘అరే, నీ బర్త్‌డే కూడా ఇవాళేనా’’?’ అని ఆశ్చర్యపోతుంటారు.. అదే సెలబ్రిటీల విషయానికొస్తే మాత్రం భలే సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్స్, టెక్నీషియన్స్ ఈ సోమవారం (నవంబర్్ 7) న పుట్టారో వాళ్లెవరో చూద్దాం..

కమల్ హాసన్..

విశ్వనటుడు కమల్ హాసన్ 1954 నవంబర్ 7న పుట్టారు. 2022 నవంబర్ 7తో 68వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.. ఆయన చేసిన సినిమాలు, ప్రాణం పోసిన పాత్రలు, ప్రయోగాలు మరెవరికీ సాధ్యం కాదు.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ చేస్తున్నారు కమల్..

అనుష్క శెట్టి..

జేజమ్మగా అద్భుతమైన తన నటనకిగానూ తెలుగు ప్రేక్షకులచేత జేజేలు కొట్టించుకున్న నటి అనుష్క అలియాస్ స్వీటీ.. స్వీటీ అనే పేరుకి తగ్గట్టే తన మనసు ఎంతో మంచిది అనే మాట చాలా మంది చెప్తుంటారు.. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోయిన్‌గా చేస్తూనే.. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనుష్క నవంబర్ 7తో 42 సంవత్సరంలోకి అడుగు పెడుతోంది..

త్రివిక్రమ్..

ఎవరో పుట్టించనిదే మాటలెలా పుడతాయి అన్నట్టు.. సినిమా డైలాగులని నిజ జీవిత గాధలకు అన్వయించి, తన మాటల్ని మనం ప్రతిరోజూ మాట్లాడుకేునేలా చేసిన రచయిత, తత్వవేత్త, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. తెలుగు సినిమా మాటలకు అందాన్ని, అర్థాన్ని తీసుకొచ్చిన స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ నవంబర్ 7నే పుట్టారు..

వెంకట్ ప్రభు..

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు.. ‘సరోజ’, ‘గోవా’ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమే.. ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.. యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్యతో చేస్తున్న సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.. వెంకట్ ప్రభు జన్మదినం కూడా నవంబర్ 7..

సింగర్ కార్తీక్..

తన మధురమైన గాత్రంతో ఎన్నో పాటలకు ప్రాణం పోసిన యంగ్ అండ్ టాలెంటెడ్ సింగర్ కార్తీక్ నవంబర్ 7న జన్మించారు.. భాష ఏదైనా భావం అర్థమయ్యేలా అద్భుతంగా పాడి తన ప్రతిభతో ప్రేక్షకులను అలరించిన కార్తీక్ 1981 నవంబర్ 7న జన్మించారు..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus