పూరి ఇలా దిగజారిపోయాడేంటి..?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. రామ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుంది. జూలై 18 న విడుదలవ్వనున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇక ప్రమోషన్లలో భాగంగా నిన్న ట్రైలర్ ను వదిలారు. ఈ ట్రైలర్ మొత్తం యాక్షన్ మరియు బూతు డైలాగులు, బూతు సీన్లతో నింపేసాడు డైరెక్టర్ పూరి. దీంతో ఈ చిత్రానికి సెన్సార్ సమస్యలు తప్పవని అంటున్నారు ఫిలింనగర్ విశ్లేషకులు. విచిత్రమేమిటంటే.. ఈ చిత్రానికి పని చేసిన యూనిట్ సభ్యులే స్వయంగా ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ చాలా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సీన్లు కూడా చాలా బోల్డ్ గా ఉన్నాయి. అయితే ఈ సీన్లు సినిమాలో కనిపించే ఛాన్స్ లేదని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. ట్రైలర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు కాబట్టి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు కానీ… సినిమా రిలీజ్ కి ముందే ఇచ్చే టీవీ యాడ్స్ లో మాత్రం చాలా మెటీరియల్ కట్ అవడం ఖాయంగా కనిపిస్తుంది.

పూరి సినిమాల్లో హీరో, హీరోయిన్లకు బోల్డ్ డైలాగ్స్ ఉండడం కామన్… కానీ ఈ సారి అవి శృతిమించాయి.. హీరోయిన్ తో పచ్చిగా డైలాగ్స్ చెప్పించాడు. రొమాంటిక్ సీన్లు, తెలంగాణా యాసలో చెప్పే డైలాగులు మరింత డెప్త్ కు వెళ్ళిపోయాయని నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు. హిట్లు లేకపోతే మాత్రం ఇలా అడల్ట్ కంటెంట్ పై ఆధారపడటమేంటి.. పూరి ఇలా దిగజారిపోయాడు అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏమో ఒకోసారి ఇలాంటివే పబ్లిసిటీకి బాగా పనిచేస్తాయి. పూరి ఆ ఫార్ములానే అప్లై చేసుంటాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus