సినిమాలకు చంద్రబాబు ఆఫర్!

  • March 26, 2016 / 06:10 AM IST

ఆంధ్రప్రదేశ్ లో సినిమా షూటింగ్ లు జరపాలని మరోమారు కోరారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. నారా రోహిత్‌ హీరోగా తెరకెక్కిన ‘రాజా చెయ్యివేస్తే’ ఆడియో వేడుక విజయవాడలోని సిద్ధార్థ కళాశాల మైదానంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ”మంచి సినిమాలు తీయడం నిర్మాతలు అలవాటు చేసుకోవాలని సూచించారు. తెలుగు సినిమాలకు ఒక చరిత్ర ఉందని, సినిమా భవిష్యత్ మరింత విస్తృతమవుతోందని వివరించారు. ఆంధ్రాలో కూడా సినిమా షూటింగ్ లకు అనువైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని, సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో సినిమాలు తీసేందుకు వస్తే ప్రత్యేక రాయితీలు ఇస్తామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus