ఈ బయోపిక్ ను ఆ సెన్సిబుల్ డైరెక్టర్ హ్యాండిల్ చేయగలడా

  • May 2, 2018 / 12:56 PM IST

చిత్ర రచయిత-నిర్మాత విష్ణు ఇందూరితో మనస్పర్ధల అనంతరం సినిమా నుంచి దర్శకుడు తేజ తప్పుకొన్న విషయం తెలిసిందే. తేజ నిష్క్రమణ అనంతరం “ఎన్టీయార్” బయోపిక్ కి దర్శకుడు ఎవరు అనే విషయంలో క్లారిటీ లేకుండాపోయింది. ముందు రాఘవేంద్రరావు, తర్వాత బుర్రా నరసింహాల పేర్లు వినిపించినప్పటికీ.. ఆ తర్వాత మాత్రం బాలకృష్ణే ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయం కాస్త బలంగా వినబడింది.

అయితే.. తాజా సమాచారం ప్రకారం “ఎన్టీయార్” బయోపిక్ కి దర్శకుడిగా “అందరి బంధువయా, ఆ నలుగురు” చిత్రాల దర్శకుడు చంద్ర సిద్దార్ధ్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కథ-కథనం సిద్ధంగా ఉండడం, క్యాస్టింగ్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోవడంతో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకొన్న చంద్ర సిద్దార్ధ్ అయితే ఈ ప్రొజెక్ట్ కు న్యాయం చేస్తాడని బాలయ్య కూడా అనుకొంటున్నారట. సో, అన్నీ సెట్ అయితే త్వరలోనే చంద్ర సిద్ధార్ధ్ ఆన్ సెట్స్ కి వచ్చే అవకాశం ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus