హీరోకి హీరోయిన్ పెళ్లి ప్రపోజల్ పెట్టినట్లు…. త్రిష కి ఛార్మి పెళ్లి ప్రపోజల్ చేయడం ఏంట్రా? అని మతి ఏమైనా పోయిందా ? అని తిట్లు మొదలెట్టకండి. ఇదేమి గాసిప్ ఏమి కాదు.. సోషల్ మీడియా సాక్షిగా ఛార్మి పెట్టిన ప్రపోజల్. ఈరోజు త్రిష పుట్టినరోజు. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఛార్మి బర్త్ డే విషెష్ చెబుతూ విభిన్నంగా “ఈ ఏడాది అయినా పెళ్లి ప్రపోజల్ని పరిగణనలోకి తీసుకుంటావా.?’ అని ప్రశ్నించింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
త్రిష గత ఏడాది నిశ్చితార్ధం వరకు వెళ్లి పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. ఆ తర్వాత పెళ్లి ఊసు ఎత్తకుండా సినిమాల్లో బిజీ అయింది. ఛార్మికి హీరోయిన్ గా అవకాశాలు తగ్గినప్పటికీ పెళ్లి చేసుకోకుండా, పూరి కనెక్ట్స్ పేరుతో సినీ రంగానికి టచ్ లో ఉంటోంది. అందమైన భామలను సినిమా రంగానికి పరిచయం చేస్తోంది. వీరిద్దరూ పార్టీ బేబీస్. మంచి స్నేహం ఉంది. అందుకే పెళ్లిచేసుకోమని త్రిషని ఇండైరక్టర్ గా ఇలా అడిగింది.
Happiest Bday @trishtrashers .. come back soooooon n let’s paaartyyy 💃🏻💃🏻😘😘😘n pls do consider my marriage proposal to u at least this yr 😛😛😛 pic.twitter.com/5P2EjoAG9Y
— CHARMME KAUR (@Charmmeofficial) May 4, 2017
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.