‘పూరి కనెక్ట్స్’ అనే బ్యానర్ ను స్థాపించి వరుసగా సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు డైరెక్టర్ పూరి జగన్నాథ్ అలాగే హీరోయిన్ ఛార్మీ. కొత్త హీరోయిన్లను ఈ బ్యానర్ ద్వారా పరిచయం చేస్తున్నారు. పూరికి ఈ బ్యానర్ కాకుండా ‘వైష్ణో అకాడమీ మూవీస్’ అలాగే ‘పూరి టూరింగ్ టాకీస్’ అనే మరో రెండు బ్యానర్లు ఉన్నాయి. అయితే ఆ బ్యానర్లలో కూడా సూపర్ హిట్ సినిమాలు తీసాడు పూరి. అయితే ఇప్పుడు ‘పూరి కనెక్ట్స్’ బ్యానర్లోనే వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో మరోసారి తన అదృష్టాన్ని పరిష్కరించుకోవడానికి రెడీ అయ్యాడు పూరి. ‘టెంపర్’ సినిమా తర్వాత పూరికి ఒక్క హిట్టు కూడా దక్కలేదు. దీంతో ఇప్పుడు కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ కొత్త రకం కాన్సెప్ట్ తో ‘ఇస్మార్ట్ శంకర్’ ను రూపొందించాడు.
ఇదిలా ఉండగా… ఛార్మి తో కలిసి పూరి ఇప్పుడు మరో బిజినెస్ మొదలుపెట్టాడు. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రమోషన్స్ లో భాగంగానే ఈ ఇద్దరు ఓ కొత్త ఫార్మాట్ బిజినెస్ ని మొదలెట్టారని తెలుస్తుంది. బీఇస్మార్ట్(beismart.in) అనే పేరుతో ఆన్లైన్ బట్టల వ్యాపారాన్ని మొదలుపెట్టారట . తన సోషల్ మీడియా ద్వారా ఛార్మినే ఈ విషయాన్ని తెలిపింది. మొదట ఆర్డర్ చేసినవారికి 30% డిస్కౌంట్ కూడా లభిస్తుందట. అయితే ఈ విషయం పై నెటిజన్లు రక రకాల కామెంట్లు చేస్తున్నారు. ‘చివరి బట్టలమ్ముకుంటున్నారా’ , ‘ఎంత హిట్లు లేకపోతే మాత్రం ఇలాంటి బిజినెస్ ఏంటి పూరి’ అంటూ కామెంట్లు పెట్టి ట్రోల్ చేసేవారు కూడా ఉన్నారు.