విడుదలైన నెలరోజులకే అమెజాన్ ప్రైమ్లోకి ‘మజిలీ’ ?

  • May 3, 2019 / 01:33 PM IST

పెళ్ళైన తరువాత నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం ‘మజిలీ’. ఏప్రిల్ 5 న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. దివ్యంశ కౌశిక్ మరో హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. ప్రేమలో ఫెయిలయ్యి కెరీర్ ను కూడా పాడుచేసుకుని తాగుడికి బానిసైపోతున్న ఓ అబ్బాయిని… సీక్రెట్ గా ప్రేమిస్తున్న మరో అమ్మాయి పెళ్ళి చేసుకుని తనని ఎలా మార్చుకుంది అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. కథలో ఏమాత్రం కొత్తదనం లేకపోయినా డైరెక్టర్ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరుకి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

గోపిసుందర్ అందించిన పాటలు అలాగే తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక నాగ చైతన్య కు ఇది కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. అంతేకాదు శ్రావణి పాత్రలో సమంత కూడా అద్భుతంగా నటించింది. నాగచైతన్య సోలో హీరోగా 33 కోట్ల పైనే కలెక్షన్లు రాబట్టడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇక ఈ చిత్రాన్ని మే 10 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేస్తున్నారు. థియేటర్లలో మిస్సయిన ప్రేక్షకులు అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చన్న మాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus