టాలీవుడ్ లో టాప్ కమీడీయన్ అంటే ఎవరు? అంటే ఎక్కువశాతం మంది ఇట్టే చెప్పే మాట “బ్రహ్మానందం”. అయితే అలాంటి బ్రహ్మీ లాంటి వాళ్ళను సైతం దాటుకుంటూ…ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ…మంచి కమీడీయన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు 30యియర్స్ పృధ్వి…ఈ ఒక్క డైలాగ్ తో వరుస సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు….స్వతహాగా నందమూరి వంసానికి అభిమాని అయిన పృధ్వికి నందమూరి నట సింహం బాలయ్య అంటే ఎంతో భక్తి.
అదే క్రమంలో ఆయన సినిమాలను అనుసరిస్తూ…ఆయన పంచ్ డైలాగ్స్ ను పేరడీ చేస్తూ మంచి కమీడీయన్ గా దూసుకుపోతున్నాడు పృధ్వి. అయితే ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ…అనుకోకుండా పృధ్విపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. అది కూడా 498ఏ.. 420 సెక్షన్ల కింద. ఇంతకీ ఏం జరిగింది అంటే….విషయంలోకి వెళితే…ప్రస్తుతం టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గా పేరు తెచ్చుకున్న మన 30యియర్స్ ఇండస్ట్రీ పృధ్వి పై తనన పెళ్లి చేసుకొని పృథ్వీ మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయించిందో మహిళ.
హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. 498ఏ.. 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే ఇంతకీ ఎవరా మహిళా? ఆమెకు పృధ్వికి ఉన్న సంభంధం ఏంటి? ఈ న్యూస్ లో ఎంత నిజం ఉంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక పోలీసులు విచారణలో భాగంగా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. మరి దీనిపై ఏం జరుగుతుందో చూడాలి.