స్టార్స్ ని సూపర్ స్టైల్ గా చూపించడంలో ఘనుడు సురేందర్ రెడ్డి

  • December 8, 2016 / 06:12 AM IST

వేదికలపై అతి తక్కువగా మాట్లాడే నేటి దర్శకుల్లో సురేందర్ రెడ్డి ఒకరు. ఆయన సినిమాలు మాత్రం ఎక్కువ మాట్లాడుకునేలా చేస్తాయి. పాటలు, ఫైట్లు మాత్రమే కాదు.. హీరో క్యారక్టరైజేషన్ నుంచి అతను వేసుకున్న షర్ట్ గురించి కూడా చర్చించుకుంటారు. అంత స్టైల్ గా ఆలోచిస్తారు సురేందర్ రెడ్డి. ఎన్ని హిట్లు అందుకున్న హీరో అయినా తన మూవీలోకి రాగానే కొత్త స్టైల్లో కనిపించాల్సిందే. ఈ డైరక్టర్ చూపించిన హీరో స్టైల్స్ పై ఫోకస్…

కళ్యాణ్ రామ్“అతనొక్కడే ” సినిమా ద్వారా సురేందర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి సినిమాలోనే తన అభిరుచి ఏమిటో చూపించారు. ఫైట్స్ చేసే హీరో రఫ్ గా ఉండాల్సిన అవసరం లేదని నిరూపించారు. “అతనొక్కడే “లో నందమూరి కళ్యాణ్ రామ్ ని చాలా స్టైల్ గా చూపించి విజయాన్ని అందుకున్నారు.

ఎన్టీఆర్సురేందర్ రెడ్డి రెండో సినిమాని కూడా నందమూరి హీరోతోనే చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అశోక్ ని తెరకెక్కించారు. మాస్ లో విపరీతమైన ఫాలో ఉన్న తారక్ ని సైతం కొత్తగా చూపించారు. ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసినప్పటికీ మోచేతివరకు మడిచి ఉంటుంది. వీరి కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం ఊసరవెల్లి లో ఎన్టీఆర్ సూపర్ స్టైల్ గా కనిపిస్తారు.

మహేష్ బాబుసూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రాల్లో అతిధి పేరు చెప్పగానే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది ప్రిన్స్ హెయిర్ స్టయిల్. బంగారు రంగులో ఉండే జుట్టు కళ్లమీద పడుతుంటే మహేష్ హాలీవుడ్ స్టార్ లా అనిపిస్తారు. ఇందులో సూపర్ స్టార్ ని డిఫరెంట్ గా చూపించడంలో డైరక్టర్ సురేందర్ రెడ్డి సక్సస్ అయ్యారు.

రవితేజప్రతి పనిలోనూ కిక్ ఆశించే ఉత్సాహవంతమైన యువకుడు ఎలా ఉంటాడో… తన మనసులో గీసుకున్న బొమ్మను రవితేజ రూపంలో కిక్ సినిమాలో వెండితెరపై ఆవిష్కరించారు సురేందర్ రెడ్డి. డైరక్టర్ ఆలోచన ప్రకారం మాస్ మహా రాజ్ తన బాడీని మార్చుకున్నారు. స్టైల్ గా కనిపించి ప్రశంసలు అందుకున్నారు.

అల్లు అర్జున్తన సినిమాలతో విభిన్నమైన స్టైల్స్ ని పరిచయం చేసే హీరో అల్లు అర్జున్. అందుకే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా కిరీటం అందుకున్నారు. ఈ స్టైల్ హీరో, స్టైల్ డైరక్టర్ సురేందర్ రెడ్డి కలిసి సినిమా చేస్తే లుక్ అదిరిపోతుంది. రేసుగుర్రం సినిమాలో అదే జరిగింది. బన్నీ అటు అల్లరి కుర్రోడిగాను, పోలీసుగాను హ్యాడ్సమ్ గా కనిపించి సూపర్ హిట్ అందుకున్నారు.

రామ్ చరణ్ తేజ్సురేందర్ రెడ్డి తాజా చిత్రం ధృవ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి చెర్రీ లుక్ గురించే యువతలో చర్చ. ఇంతక ముందు చిత్రాల్లో రామ్ చరణ్ స్టైల్ గా కనిపించినప్పటికీ ఇందులో సిక్స్ ప్యాక్ బాడీ తో రియల్ ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించారు. డైరక్టర్ సూచన మేరకు చరణ్ తనకు ఇష్టం లేకపోయినా జిమ్ కి వెళ్లి బాడీని శిల్పం లా మలుచుకున్నారు. హాట్ గా తయారయ్యారు.

ఇలా తమ సినిమాల్లో హీరోలు అందంగా, స్టైల్ గా కనిపించడం వెనుక దర్శకుడు సురేందర్ రెడ్డి కృషి ఎంతో ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus